
National Boxing Championship: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
హిసార్‌లో బుధవారంఏకపక్షంగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 5–0తో మనీశ్ రాథోడ్ (ఉత్తరప్రదేశ్)పై గెలిచాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఆశిష్ (హిమాచల్‌ప్రదేశ్)తో హుసాముద్దీన్ తలపడతాడు.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా 147/2
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్స్ ఉస్మాన్ ఖాజా (54 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబ్‌షేన్ (79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వర్షం అంతరాయం కలిగించడంతో తొలిరోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఖాజా, లబ్‌షేన్ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు.
చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం
SA W Vs Ind W: అదరగొట్టిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్.. పరిపూర్ణ విజయం