
హుసాముద్దీన్
తాష్కెంట్: ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్ కుమార్ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ఆశిష్ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్‌లో నిష్క్రమించాడు.
శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్‌లలో హుసాముద్దీన్ 5–0తో లియు పింగ్ (చైనా)పై, నవీన్ 5–0తో జియోంగ్ జెమిన్ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్ 2–5తో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అర్లెన్ లోపెజ్ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment