గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడంలో మరోసారి నిరాశపరిచారు. శనివారం జరిగిన ఫైనల్స్లో మణిపూర్ బాక్సర్లు సరితా దేవి, దేవేంద్రో సింగ్ ఓటమి చవిచూసి రజత పతకాలక పరిమితమయ్యారు.
మహిళల 57-60 కిలోల విభాగంలో సరితా దేవి 1-3 తో ఆస్ట్రేలియా బాక్సర్ షెల్లీ వాట్స్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో దేవేంద్రో 1-2తో ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ పాడీ బార్నెస్ చేతిలో ఓడాడు. దీంతో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఇదే రోజు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఫైనల్ బౌట్ జరగనుంది.
బాక్సింగ్లో భారత్కు రెండు రజతాలు
Published Sat, Aug 2 2014 8:24 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement