బాక్సింగ్‌లో నాలుగు పతకాలు ఖాయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ‘పంచ్’ అదిరింది. వివిధ విభాగాల్లో కనీసం నాలుగు పతకాలను ఖాయం చేశారు. మహిళల ఫ్లయ్ (48-51 కేజీలు) వెయిట్ క్వార్టర్‌ఫైనల్లో పింకి జాంగ్రా 3-0తో జాక్వలిన్ వాంగి (పపువా న్యూగినియా)పై; లైట్ వెయిట్ బౌట్‌లో లశిరామ్ సరితా దేవి 3-1తో చార్లెని జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల వెల్టర్ వెయిట్ (69 కేజీలు) క్వార్టర్‌ఫైనల్లో మన్‌దీప్ జాంగ్రాకు వాకోవర్ లభించడంతో సెమీస్ బెర్త్ ఖాయమైంది.
బౌట్‌కు ముందు జాంగ్రా ప్రత్యర్థి డానియెల్ లెవిస్ (ఆస్ట్రేలియా) వైద్య పరీక్షల్లో విఫలమయ్యాడు. ప్రిక్వార్టర్స్ బౌట్‌లో లెవిస్ కంటి పైభాగంలో తగిలిన గాయం ఇంకా నయంకాకపోవడంతో డాక్టర్లు పోటీకి అనర్హుడిగా తేల్చారు. పురుషుల లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు)లో దేవేంద్రో లశిరామ్ 3-0తో అక్విల్ అహ్మద్ (స్కాట్లాండ్)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. బాక్సింగ్‌లో ఒకవేళ సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం లభిస్తుంది. కాబట్టి కనీసం నాలుగు కాంస్యాలు లేదా అంతకంటే మంచి పతకాలు భారత్ ఖాతాలో చేరినట్లే.