Sarita Devi
-
బాక్సర్ సరిత దేవికి కరోనా పాజిటివ్
సాక్షి, ఇంఫాల్: ప్రముఖ ఇండియన్ బాక్సర్ లైశ్రమ్ సరితా దేవి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోమవారం ప్రకటించారు. గత మూడు రోజులుగా తను జ్వరం, కండరాల నొప్పితో బాధపడ్డారని, దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కోవిడ్ పరీక్ష ఫలితాల్లో తనకు పాజిటివ్‌గా తెలిందని తెలిపారు. దీంతో తన భర్త, కుమారుడు సైతం కరోనా పరీక్షలు చేయించుకోగా తన భర్తకు పాజిటివ్ రాగా.. తన కుమరుడి నెగిటివ్ వచ్చినట్లు సరిత తెలిపారు. (చదవండి: ఒకే రోజు కోలుకున్న 7,866 మంది) దేశంలో రోజు రోజు కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 57,982 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిసి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26,47,664 కు చేరుకుంది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. (చదవండి: ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..) -
సరితా దేవికి చుక్కెదురు
ఉలాన్–ఉదె (రష్యా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ విశ్వవిజేత సరితా దేవికి ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన 60 కేజీల విభాగం రెండో రౌండ్ బౌట్లో 2006 ప్రపంచ చాంపియన్ సరితా దేవి 0–5తో రష్యా బాక్సర్ నటాలియా షాద్రినా చేతిలో ఓడిపోయింది. 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ నందిని 0–5తో ఇరీనా (జర్మనీ) చేతిలో ఓడింది. -
భారత బాక్సర్ల పసిడి పంట
గువాహటి: సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో మేరీకోమ్ 5–0తో భారత్‌కే చెందిన వన్లాల్ దువాటిపై గెలిచింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో సరితా దేవి 3–2తో సిమ్రన్‌జిత్ కౌర్ (భారత్)పై, జమున 5–0తో సంధ్యారాణి (భారత్)పై, నీరజ 5–0తో మనీషా (భారత్)పై గెలిచారు. 48 కేజీల విభాగం ఫైనల్లో మోనిక (భారత్) 2–3తో గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో, లవ్లీనా (భారత్) 2–3తో అసుంతా (ఇటలీ) చేతిలో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్ (49 కేజీలు), అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 4–1తో సచిన్ సివాచ్ (భారత్)పై, దీపక్ 5–0తో గోవింద్ (భారత్)పై, ఆశిష్ 4–1తో దుర్యోధన్ (భారత్)పై, శివ థాపా 5–0తో మనీశ్ (భారత్)పై విజయం సాధించారు. ఫైనల్లో ఓడిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), కవిందర్ (56 కేజీలు) రజత పతకాలను దక్కించుకున్నారు. -
క్వార్టర్స్‌లో సరితా దేవి
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవి శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల 60 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సరితా దేవి 4–2తో మాంచెస్ కాన్కెహా (ఇటలీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా సెమీఫైనల్‌కు ‘బై’ లభించడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు) తొలి రౌండ్లో జు బోజియాంగ్ (చైనా)తో తలపడతాడు. గతేడాది ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ రజత పతకం సాధించాడు. -
సరిత ‘ప్రొ’ పంచ్ అదుర్స్
ఇంఫాల్: భారత మహిళా స్టార్ బాక్సర్ లైష్రామ్ సరితా దేవి తన ప్రొఫెషనల్ కెరీర్లో శుభారంభం చేసింది. తన తొలిపోరులో హంగేరికి చెందిన వెటరన్ సోఫియా బెడోను కంగుతినిపించింది. ఆదివారం ఇక్కడి ఖుమన్ లాంపక్ స్టేడియంలో జరిగిన ‘ఐబీసీ’ ఫైట్నైట్లో సరిత... ప్రొ సర్క్యూ ట్లో ఎంతో అనుభవజ్ఞురాలైన సోఫియాను అలవోకగా ఓడించింది. 59 ప్రొఫెషనల్ బౌట్లలో తలపడిన ఆమె భారత బాక్సర్ పంచ్‌లకు తలవంచింది. మరో పోరులో పింకీ జాంగ్రా కూడా శుభారంభం చేసింది. 26 ఏళ్ల పింకీ... స్లోవేకియాకు చెందిన క్లౌడియా ఫెరెన్జీపై విజయం సాధించింది. -
సరితాదేవిపై ఏడాది నిషేధం
న్యూఢిల్ల: భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. ఆసియా గేమ్స్‌లో తనకు అన్యాయం జరిగిందని సరిత ఆరోపిస్తూ కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తొలుత జీవితకాలం నిషేధం విధించాలని భావించారు. కాగా సరిత వెనక్కు తగ్గి కాంస్య పతకాన్ని మళ్లీ స్వీకరించడం, భారత బాక్సింగ్ సమాఖ్య చేసిన ప్రయత్నాలతో నిషేధాన్ని ఏడాదికి తగ్గించారు. గత అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఇక భారత కోచ్ బీఐ ఫెర్నాండెజ్‌ను రెండేళ్లు నిషేధించారు. కాగా సరితపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. -
కాంస్య పతకం మళ్లీ అందుకున్నసరితా దేవి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతక వివాదం ముగిసింది. అప్పట్లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితా దేవి మనసు మార్చుకుంది. వెనక్కు ఇచ్చేసిన పతకాన్ని సరిత భారత ఒలింపిక్ సంఘం నుంచి మళ్లీ తీసుకుంది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సందర్భంగా సెమీఫైనల్స్‌లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన సరితాదేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్‌లో మ్యాచ్‌లో జడ్జీలు సరితా దేవి ఓడిపోయినట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది. సరిత పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య భావించింది. ఆ తర్వాత రాజీమార్గంతో వ్యవహరించడం, తాజాగా సరిత పతకం తీసుకోవడంతోఈ వివాదం ముగిసినట్టయ్యింది. -
బాక్సర్ సరితా దేవికి సచిన్ అండ
-
బాక్సర్ సరితాదేవికి సచిన్ మద్దతు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నుంచి నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ ఎల్.సరితా దేవికి రాజ్యసభ సభ్యుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఇంచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సరిత తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఏఐబీఏ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సచిన్ ఈరోజు కేంద్ర క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్‌ను కలిశారు. సరితాదేవి భవిష్యత్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంతో చర్చించి సరితపై చర్యలు లేకుండా చేయాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. సచిన్ బాటలోనే సరితకు అండగా నిలుస్తానని బాక్సర్ విజేందర్‌తోపాటు పలువురు క్రీడాకారులు ప్రకటించారు. భారత ప్రభుత్వం తరపున ఈ విషయం తాము ఏఐబీఏతో చర్చిస్తామని మంత్రి సర్బానందా సోనోవాల్ హామీ ఇచ్చారు. భారత ప్రజలు సరితాదేవికి అండగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సరితాదేవిపై నిషేధం ఎత్తివేసేందుకు తాను కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ** -
రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!
న్యూఢిల్లీ: ఏఐబీఏ నుంచి తాత్కాలిక నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవి అంశంపై రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో బుధవారం సమావేశం కానున్నారు. ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆ సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయిందని, దురదృష్టవశాత్తు అది బహిర్గతమైందన్నాడు. ఈ క్రమంలోనే రేపు క్రీడా మంత్రితో సచిన్ సమావేశం కానున్నారు. -
సరితకు సచిన్ మద్దతు
ముంబై: తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ ఎల్.సరితా దేవికి... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు. బాక్సర్ కెరీర్ అర్ధాంతరంగా ముగియకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘జరిగిన సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయింది. దురదృష్టవశాత్తు అది బహిర్గతమైంది. అయినప్పటికీ ఆమె వెంటనే క్షమాపణలు కూడా చెప్పింది. పశ్చాత్తాపం వ్యక్తం చేసింది కాబట్టి మరో అవకాశం ఇచ్చి చూడాలి. ఈ కేసులో దేశం మొత్తం సరితకు అండగా నిలవాలి. ఆమె అత్యున్నత స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పించాలి’ అని సచిన్ లేఖలో రాశాడు. -
సరితాపై కఠిన చర్యలు!
దీర్ఘకాల నిషేధం విధించే యోచనలో ఏఐబీఏ నేడు క్రమశిక్షణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ/కౌలాలంపూర్: ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సిద్ధమవుతోంది. ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినా... ఆమెపై దీర్ఘకాల నిషేధం విధించాలని యోచిస్తోంది. నేటి (గురువారం) క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత బాక్సర్‌పై తుది చర్యలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కౌ వు తెలిపారు. స్విట్జర్లాండ్, అమెరికా, స్పెయిన్, ఇంగ్లండ్‌ల నుంచి ఒక్కొక్కరు క్రమశిక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘సరితా కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఆమెకు భారీ శిక్ష విధించనున్నాం. అంతర్జాతీయ పోటీల్లో అలాంటి సంఘటనలను మేం సహించం. గెలుపును అంగీకరించినప్పుడు ఓటమిని కూడా ఆమోదించాలి. ప్రతి ఒక్కరు సరితలాగా ప్రవర్తిస్తే ఈ పోటీలు ఎందుకు?’ అని వు ప్రశ్నించారు. నిషేధం ఎత్తివేస్తారు మరోవైపు తనపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తారని సరితా ఆశాభావం వ్యక్తం చేసింది. రింగ్‌లోకి మళ్లీ దిగేందుకు అనుమతి లభిస్తుందని చెప్పింది. ‘ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పా. ఏఐబీఏ అధ్యక్షుడు ఏం మాట్లాడాడో తెలుసుకుంటా. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా. నాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారని నమ్ముతున్నా. ఈ కేసులో నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నా’ అని సరితా వ్యాఖ్యానించింది. బాక్సర్ క్షమాపణలు చెప్పింది కాబట్టి శిక్ష తక్కువగా ఉంటుందని బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా అన్నారు. ముందస్తు ప్రణాళికతో కాకుండా భావోద్వేగంలో ఆ సంఘటన జరిగిందన్నారు. -
బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం సంతృప్తి చెందలేదని అన్నారు. అయితే ఆమె క్షమాపణ చెప్పడం, అది కావాలని జరిగిన సంఘటన కాదని భారత బృందం కూడా తెలియజేయడంతో హెచ్చరించి వదిలేయాలని నిర్ణయించామని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (ఓసీఏ) తెలిపింది. ఈ విషయాన్ని ఓసీఏ గౌరవ జీవితకాల ఉపాధ్యక్షుడు వీ జిఝాంగ్ తెలిపారు. భారత బృందానికి దీంతో ఏమాత్రం సంబంధం లేదని, అది కేవలం ఒక్క అథ్లెట్ చేసిన పొరపాటని తాము భావిస్తున్నామన్నారు. -
ఏడుస్తూ.. పతకం తిరిగిచ్చేసిన బాక్సర్ సరిత
ఆసియా క్రీడల్లో ఎప్పుడూ లేనంత ఉద్విగ్నత బుధవారం కనిపించింది. సెమీఫైనల్స్‌లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన భారత బాక్సర్ సరితాదేవి అధికారులకు, ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సరితపై నెగ్గినట్లు ప్రకటించిన జీనా పార్క్ ఫైనల్లో ఓడిపోయి రజత పతకం సాధించింది. వాస్తవానికి సెమీస్ బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చింది. అయినా కూడా జీనాపార్క్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. దాంతో పోడియం మీదకు పిలిచినప్పటినుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. అసలు పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసింది. ఇంతకుముందు ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు కూడా గెలిచిన సరితాదేవి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఒకటిన్నర సంవత్సరాల బాబును కూడా తాను వదిలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనను గుర్తుపట్టలేదని సరితాదేవి వాపోయింది. తనకు ఆ పతకం అక్కర్లేదు కాబట్టే దాన్ని కొరియన్లకు ఇచ్చేశానని చెప్పింది. దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. -
అన్యాయం జరిగింది.. పతకం తీసుకోను..
-
కాంస్యంతో సరిపెట్టుకున్న పూజారాణి
ఇంచియాన్:ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ లో మేరీ కోమ్ ఫైనల్ కు చేరగా, మరో ఇద్దరు బాక్సర్లు సెమీ ఫైనల్లో నిష్క్రమించారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో పూజా రాణి 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆమెకు కాంస్య పతకానికే పరిమితమైంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఏషియాడ్ క్రీడల్లో ఆమె మహిళల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన పోరులో చైనా క్రీడా కారిణి లీ కైన్ చేతిలో ఓటమి చెందింది. సెకెండ్ రౌండ్ లో ఆకట్టుకున్న పూజారాణి.. మూడో రౌండ్ కు వచ్చే సరికి చతికిలబడింది. రెండో రౌండ్ లో 27 పాయింట్లు సాధించిన పూజారాణి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. అనంతరం మూడో రౌండ్ లో పదునైన పంచ్ లతో చెలరేగిన లీ కైన్.. జడ్జిల నుంచి అత్యధిక పాయింట్లు సాధించి పూజారాణికి చెక్ పెట్టింది. ఇదిలా ఉండగా నాల్గో రౌండ్ లో పూజారాణి పుంజుకుందామని ప్రయత్నాలను లీ అడ్డుకుని ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో మేరీకోమ్ ఫైనల్ రౌండ్ కు చేరింది.వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్‌లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్‌కు మరో పసిడి పతకం దక్కనుంది.అయితే సరితా దేవి కూడా సెమీ ఫైనల్లో ఓటమి చెందడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
ఫిక్సింగ్ వల్లే బాక్సింగ్‌లో ఓటమి?
ఆసియా క్రీడల్లో కొత్త వివాదం మొదలైంది. ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితాదేవి సెమీ ఫైనల్స్‌లో అద్భుతంగా పోరాడినా.. ఆమెను ఓడిపోయినట్లు ప్రకటించారని, దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ బౌట్లో తాను పూర్తి ఆధిపత్యం కనబర్చినా, చివరకు జడ్జిలు మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితాదేవి కూడా ఆగ్రహానికి గురైంది. ఇది చాలా అనాగరికమైన నిర్ణయమని సరిత భర్త తోయిబా సింగ్ అన్నారు. ఇలాగే తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మంగోలియా జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత భారత జట్టుకూడా ఫిర్యాదుచేసింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇక మన బాక్సింగ్ సంఘాల విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో చివరకు కొత్తగా బాక్సింగ్ ఇండియా అనే సంస్థను అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఏర్పాటుచేయించింది. సరితాదేవి బౌట్‌ను సమీక్షించాలంటూ ఆమె భర్తతో పాటు టీమ్ కోచ్ సాగర్ ధైయ్యా కూడా ఫిర్యాదుచేశారు. ఇందుకోసం 500 డాలర్ల ప్రొటెస్ట్ ఫీజు కూడా కట్టారు. బాక్సింగ్‌లో భారత్‌కు తాము అనేక పతకాలు తెస్తున్నామని, అయినా జట్టు యాజమాన్యం మాత్రం నిరసన విషయంలో తమకు అండగా ఉండట్లేదని సరితాదేవి వాపోయింది. ఈశాన్య ప్రాంతాలకు చెందినవాళ్లు భారతీయులు కారా అని ఆమె నిలదీసింది. సరితకు జరిగిన అన్యాయం విషయంలో మేరీ కోమ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యర్థి కొరియా బాక్సర్ కావడం వల్లే సరిత ఓడిపోయినట్లు ప్రకటించారని, ఇది చాలా దారుణమని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. -
మూడు పతకాలు ఖాయం
బాక్సింగ్ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి, పూజా రాణి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరు తమ విభాగాల్లో సెమీస్‌లో ఓటమిపాలైనా కనీసం కాంస్యం దక్కుతుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ సునాయాసంగా సి హైజువన్ (చైనా)ను చిత్తు చేసింది. మేరీకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి మూడో రౌండ్లో కొంత పోటీ ఇవ్వగలిగినా...ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ ముందు నిలబడలేకపోయింది. సెమీస్‌లో మేరీకోమ్... వియత్నాంకు చెందిన లి థాయ్ బాంగ్‌తో తలపడుతుంది. 60 కేజీల విభాగంలో సరితాదేవి, సడ్ ఎర్డిన్ (మంగోలియా)పై ఘన విజయం సాధించింది. సెమీస్‌లో సరిత... జినా పార్క్ (కొరియా)ను ఎదుర్కొంటుంది. 75 కేజీల విభాగం క్వార్టర్స్‌లో పూజా రాణి, చైనీస్ తైపీకి చెందిన షెన్ దారా ఫ్లోరాను ఓడించింది. పదునైన అప్పర్‌కట్‌లతో చెలరేగిన పూజను ప్రత్యర్థి అడ్డుకోలేకపోయింది. సెమీస్‌లో లి కియాన్ (చైనా)తో పూజ పోటీ పడుతుంది. పురుషుల 49 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరేందుకు దేవేంద్రో సింగ్‌కు 87 సెకన్ల సమయం సరిపోయింది. దేవేంద్రో ‘నాకౌట్’ పంచ్‌తో బౌన్‌ఫోన్ (లావోస్)ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో అతను షిన్ జాంగున్ (కొరియా)ను ఢీకొంటాడు. -
బాక్సింగ్‌లో భారత్‌కు రెండు రజతాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడంలో మరోసారి నిరాశపరిచారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో మణిపూర్ బాక్సర్లు సరితా దేవి, దేవేంద్రో సింగ్ ఓటమి చవిచూసి రజత పతకాలక పరిమితమయ్యారు. మహిళల 57-60 కిలోల విభాగంలో సరితా దేవి 1-3 తో ఆస్ట్రేలియా బాక్సర్ షెల్లీ వాట్స్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో దేవేంద్రో 1-2తో ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ పాడీ బార్నెస్ చేతిలో ఓడాడు. దీంతో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఇదే రోజు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఫైనల్ బౌట్ జరగనుంది.