
లైష్రామ్ సరితా దేవి
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవి శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల 60 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్‌లో సరితా దేవి 4–2తో మాంచెస్ కాన్‌కెహా (ఇటలీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా సెమీఫైనల్‌కు ‘బై’ లభించడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు) తొలి రౌండ్‌లో జు బోజియాంగ్ (చైనా)తో తలపడతాడు. గతేడాది ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ రజత పతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment