గువాహటి: సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో మేరీకోమ్ 5–0తో భారత్‌కే చెందిన వన్‌లాల్ దువాటిపై గెలిచింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో సరితా దేవి 3–2తో సిమ్రన్‌జిత్ కౌర్ (భారత్)పై, జమున 5–0తో సంధ్యారాణి (భారత్)పై, నీరజ 5–0తో మనీషా (భారత్)పై గెలిచారు.
48 కేజీల విభాగం ఫైనల్లో మోనిక (భారత్) 2–3తో గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో, లవ్లీనా (భారత్) 2–3తో అసుంతా (ఇటలీ) చేతిలో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్ (49 కేజీలు), అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 4–1తో సచిన్ సివాచ్ (భారత్)పై, దీపక్ 5–0తో గోవింద్ (భారత్)పై, ఆశిష్ 4–1తో దుర్యోధన్ (భారత్)పై, శివ థాపా 5–0తో మనీశ్ (భారత్)పై విజయం సాధించారు. ఫైనల్లో ఓడిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), కవిందర్ (56 కేజీలు) రజత పతకాలను దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment