
బాక్సింగ్ ఈవెంట్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), అమిత్ పంఘాల్ (51 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో నిఖత్ 5–0తో స్టబ్లీ అల్ఫియా సవానా (ఇంగ్లండ్)పై నెగ్గగా... నీతూ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి ప్రియాంక ధిల్లాన్ (కెనడా) చేతులెత్తేయడంతో రిఫరీ మూడో రౌండ్‌లో బౌట్‌ను నిలిపి వేశారు.
పురుషుల విభాగం సెమీఫైనల్లో అమిత్ 5–0తో చిన్‌యెంబా (జాంబియా)పై నెగ్గాడు. మహిళల 60 కేజీల సెమీఫైనల్లో జాస్మిన్ (భారత్) 2–3తో జెమ్మా రిచర్డ్‌సన్ (ఇంగ్లండ్) చేతిలో, పురుషుల 57 కేజీల సెమీఫైనల్లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 1–4తో జోసెఫ్ కామె (ఘనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment