రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!
న్యూఢిల్లీ: ఏఐబీఏ నుంచి తాత్కాలిక నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవి అంశంపై రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో బుధవారం సమావేశం కానున్నారు. ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు.
ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆ సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయిందని, దురదృష్టవశాత్తు అది బహిర్గతమైందన్నాడు. ఈ క్రమంలోనే రేపు క్రీడా మంత్రితో సచిన్ సమావేశం కానున్నారు.