AIBA
-
'వరల్డ్ బాక్సింగ్' భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ: 2021లో నిర్వహించబోయే పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ను భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ) తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా వచ్చే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చలు జరిపిన తరువాత భారత్ ను ఎంపిక చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. తద్వారా తొలిసారి పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత వేదిక కానుంది. -
రష్యా 'పంచ్' కు క్లియరెన్స్
మాస్కో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా బాక్సర్లకు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా).. రష్యా బాక్సర్లు ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఆమోదం తెలిపింది. గత నెల 24వ తేదీన రష్యా బాక్సర్ల వ్యక్తిగత యాంటీ డోపింగ్ రికార్డును పరిశీలించిన అనంతరం పదకొండు మందితో కూడిన ఆ జట్టుకు ఐబా క్లీన్చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రష్యా బాక్సింగ్ జట్టు రియోలో పాల్గొనే విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా రష్యా ఆటగాళ్లపై డోపింగ్ రికార్డును ఆయా ఒలింపిక్ సమాఖ్యలు పరీక్షిస్తున్నాయి. 2012 నుంచి 2015 వరకూ రష్యా పెద్ద ఎత్తును డోపింగ్ కు పాల్పడింది. దాదాపు 30 క్రీడల్లో ఆయా ఆటగాళ్లు డోపింగ్‌కు తెరలేపడంతో యావత్ రష్యాపైనే నిషేధం విధించాలంటూ పెద్ద ఎత్తును విమర్శలు వెలుగుచూశాయి. కాగా, ఐఓసీ నిర్ణయంతో రష్యా క్రీడాకారులకు కాస్త ఉపశమనం లభించింది. -
వైదొలిగిన వికాస్..కాంస్యంతో సరి
బాకు(అజెర్ బైజాన్):ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా) ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్(75 కేజీ) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీ ద్వారా రియో ఒలింపిక్స్ బెర్తును దక్కించుకున్న వికాస్.. గాయం కారణంగా సెమీ ఫైనల్ పోరు నుంచి వైదొలిగాడు. దీంతో కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించి రియోకు అర్హత సాధించాడు. అయితే ఈ పోరులో గాయపడ్డ వికాస్ సెమీ ఫైనల్ పోరుకు సిద్ధంగా లేడని టోర్నీ డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు. అతని కంటి పైభాగాన కుట్లు పట్టడంతో సెమీ ఫైనల్ పోరుకు దూరమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరో భారత బాక్సర్ మనోజ్ కుమార్(64కేజీ) కూడా రియోకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్కట్జోన్ (తజకిస్తాన్)పై నెగ్గి సెమీస్ కు చేరాడు. దీంతో అతను 64 కేజీల కేటగిరీలో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో యూరోపియన్ చాంపియన్ పాట్ మెక్- కార్మాక్(బ్రిటన్)తో మనోజ్ తలపడనున్నాడు. మరోవైపు దేవెంద్రో సింగ్(49కేజీ) ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే సెమీ ఫైనల్ అడ్డంకిని అధిగమించాల్సి ఉంది. -
ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మేరీ కోమ్‌ను అంబాసిడర్‌గా నియమించారు. ఓవరాల్‌గా ఎనిమిది మందిని ఐబా నియమించింది. ‘ఓ భారతీయురాలిగా ఈ గౌరవం దక్కినందుకు గర్విస్తున్నాను. దీనిద్వారా నేను అంతర్జాతీయ బాక్సింగ్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తాను. ఇది అందరికీ దక్కే అ వకాశం కాదు’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తను రియో గేమ్స్‌లో చోటు కోసం వచ్చే నెల 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది. -
భారత బాక్సింగ్ సంఘంపై వేటు
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) మరోసారి స్పష్టం చేసింది. అక్టోబర్ 3న గువాహటిలో జరిగే వార్షిక సమావేశానికి ఇప్పటికే సస్పెండయిన బాక్సింగ్ ఇండియా షెడ్యూల్ ను ఖరారు చేయడం చెల్లుబాటు కాదని, ఆ సమావేశానికి విలువ ఉండబోదని తెలిపింది. ఈమేరకు మంగళవారం భారత బాక్సింగ్ సంఘానికి ఏఐబీఏ చైర్మన్ కిషన్ నార్సీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. రెండు వారాల పాటు జాతీయ స్థాయిలో జరిగే వార్షిక సమావేశాల షెడ్యూల్ ను ఏఐబీఏ పరిధిలో పనిచేసే అడ్ హక్ కమిటీ మాత్రమే ఖరారు చేస్తుందని నార్సీ పేర్కొన్నారు . భారత బాక్సింగ్ అసోసియేషన్ కు సంబంధించి సలహాలు, సూచనలకు ఏఐబీఏ ఆమోదం తప్పనిసరిగా పొందాలని నార్సీ తెలిపారు. దీన్ని ఉల్లంఘించినందున భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ తాజా సస్పెన్షన్ వేటు త్వరలో దోహాలో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
బాక్సర్ సరితపై నిషేదం.. ఏడాది పాటే..!
-
బాక్సర్ సరితా దేవికి సచిన్ అండ
-
బాక్సర్ సరితాదేవికి సచిన్ మద్దతు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నుంచి నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ ఎల్.సరితా దేవికి రాజ్యసభ సభ్యుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఇంచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సరిత తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఏఐబీఏ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సచిన్ ఈరోజు కేంద్ర క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్‌ను కలిశారు. సరితాదేవి భవిష్యత్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంతో చర్చించి సరితపై చర్యలు లేకుండా చేయాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. సచిన్ బాటలోనే సరితకు అండగా నిలుస్తానని బాక్సర్ విజేందర్‌తోపాటు పలువురు క్రీడాకారులు ప్రకటించారు. భారత ప్రభుత్వం తరపున ఈ విషయం తాము ఏఐబీఏతో చర్చిస్తామని మంత్రి సర్బానందా సోనోవాల్ హామీ ఇచ్చారు. భారత ప్రజలు సరితాదేవికి అండగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సరితాదేవిపై నిషేధం ఎత్తివేసేందుకు తాను కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ** -
రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!
న్యూఢిల్లీ: ఏఐబీఏ నుంచి తాత్కాలిక నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవి అంశంపై రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో బుధవారం సమావేశం కానున్నారు. ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆ సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయిందని, దురదృష్టవశాత్తు అది బహిర్గతమైందన్నాడు. ఈ క్రమంలోనే రేపు క్రీడా మంత్రితో సచిన్ సమావేశం కానున్నారు. -
నాపై వేటువేయడానికి ఏఐబీఏ ఎవరు?
న్యూఢిల్లీ: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన తనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నిషేధం విధించడంపై అదిలి జె సుమారివాలా మండిపడ్డాడు. భారత మహిళా బాక్సర్ సరితా దేవీ తాను గెలిచిన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేయడంతో ఆమెతో పాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, అదిలి జె సుమారివాలాపై ఏఐబీఏ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి గళం విప్పిన సుమారివాలా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి విచారణ లేకుండానే తనపై నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించాడు. 'నాపై వేటు వేయడానికి ఏఐబీఏ ఎవరు? ఆ గేమ్స్ లో భారత్ బాక్సింగ్ పెద్దగా వెళ్లాను. అక్కడ క్రీడాకారులకు అన్ని విధాల సాయపడి నా పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాను' అని తెలిపారు. తన నిషేధానికి సంబంధించి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అది ఏమైనా కార్యక్రమమా?లేక పోటీని అనే విషయం తనకు తెలియడం లేదన్నారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న సుమారివాలా భవిష్యత్తులో బాక్సింగ్ పోటీలకు గాను తాను అధికారికంగా ఎటువంటి బాధ్యత తీసుకోబోనని తెలిపారు. -
'సరితపై సస్పెన్షన్ తొలగించండి'
న్యూఢిల్లీ: మహిళా బాక్సర్ సరితా దేవిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ)ను భారత బాక్సింగ్ అధ్యక్షుడు సందీప్ జజోడియా కోరారు. ఆమె ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. సరితాదేవి గతంలో ఎప్పుడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమెపై సస్సెన్షన్ తొలగించాలని ఏఐబీఏకు విజ్ఞప్తి చేశారు. ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ సరితా దేవిపై ఏఐబీఏ ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది. -
సరితా దేవీపై సస్పెన్షన్ వేటు!
-
సరితాదేవికి షాక్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) ఆమెపై ఈ చర్య తీసుకుంది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను ఏఐబీఏ సస్పెండ్ చేసింది. ఫలితంగా అన్నిరకాల పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం ఉంటుంది. బాక్సింగ్ కు సంబంధించిన సమావేశాల్లోనూ ఆమెకు ప్రవేశం ఉండదు. సరితాదేవి కోచ్ లు గురుబక్ష్ సింగ్ సాంధు, ఫెర్నాడెంజ్, సాగర్ మాల్ దయాల్ పై కూడా వేటు పడింది. ఆసియా క్రీడల్లో సెమీఫైనల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి సరితాదేవి తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. -
ఐఓఏ సభ్యత్వం తీసుకోండి:ఐబా
న్యూఢిల్లీ:కొత్తగా ఏర్పాటైన బాక్సింగ్ ఇండియా (బీఐ)ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) కోరింది. ‘ఇప్పటిదాకా భారత్‌లో బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నఅడ్‌హక్ కమిటీ మరెంతో కాలం కొనసాగదు. ఇక ఈ క్రీడకు సంబంధించి అన్ని స్థాయిల పోటీలను తమ సహకారంతో బీఐ చూసుకుంటుంది. అంతకన్నా ముందు బాక్సింగ్ ఇండియా ఐఓఏ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఏ చార్టర్‌ను అనుసరించి గుర్తింపు పొందుతుంది’ అని ‘ఐబా’ పేర్కొంది. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్యను రద్దు చేసిన అనంతరం ఈ క్రీడ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల అడ్‌హక్ కమిటీని నియమించింది. బాక్సింగ్ ఇండియాకు ‘ఐబా’ నుంచి తాత్కాలిక గుర్తింపు లభించడంతో బాక్సర్లు అధికారికంగా భారత్ తరఫున పాల్గొనే అవకాశం లభించింది.