న్యూఢిల్లీ:కొత్తగా ఏర్పాటైన బాక్సింగ్ ఇండియా (బీఐ)ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) కోరింది. ‘ఇప్పటిదాకా భారత్‌లో బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నఅడ్‌హక్ కమిటీ మరెంతో కాలం కొనసాగదు. ఇక ఈ క్రీడకు సంబంధించి అన్ని స్థాయిల పోటీలను తమ సహకారంతో బీఐ చూసుకుంటుంది. అంతకన్నా ముందు బాక్సింగ్ ఇండియా ఐఓఏ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఏ చార్టర్‌ను అనుసరించి గుర్తింపు పొందుతుంది’ అని ‘ఐబా’ పేర్కొంది.
భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్యను రద్దు చేసిన అనంతరం ఈ క్రీడ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల అడ్‌హక్ కమిటీని నియమించింది. బాక్సింగ్ ఇండియాకు ‘ఐబా’ నుంచి తాత్కాలిక గుర్తింపు లభించడంతో బాక్సర్లు అధికారికంగా భారత్ తరఫున పాల్గొనే అవకాశం లభించింది.