IOA
-
చెఫ్ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్
న్యూఢిల్లీ: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పారిస్ ఒలింపిక్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాసింది. ‘దేశానికి సేవ చేయడాన్ని నేనెప్పుడు గౌరవంగా భావిస్తాను. మానసికంగానూ సిద్ధంగా ఉంటా. కానీ... వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని 41 ఏళ్ల ఈ మణిపూర్ మహిళా బాక్సర్ లేఖలో వివరించింది. దీనిపై స్పందించిన పీటీ ఉష... మేరీకోమ్ పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమే అయినా... ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని తెలిపారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. -
ఢిల్లీకి చేరిన ఒలింపిక్స్ బృందం.. ఐఓఏ అధికారుల ఘన స్వాగతం
ఢిల్లీ: భారత ఒలింపిక్స్ బృందం సోమవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఒలింపిక్స్ కీడ్రాకారులకు ఐఓఏ అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. -
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీని ప్రకారం.. ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, సిబ్బందిపై విధించిన ఆంక్షలను తప్పక పాటించాలని తెలిపింది. టోక్యోకు వచ్చే ముందు అందరూ కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని, వారంపాటు ప్రతిరోజు టెస్టు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే క్రమంలో టోక్యో చేరిన తర్వాత 3 రోజులపాటు భారత క్రీడాకారులు ఎవరినీ కలవకూడదని ఆదేశించింది. కాగా జపాన్ ఆంక్షలను భారత ఒలింపిక్ సంఘం( ఐఓఏ) తప్పుపట్టింది. చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
టోక్యోలో ‘ఇండియా హౌజ్’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లబోయే భారత బృందం కోసం అక్కడ ‘ఇండియా హౌజ్’ను నిరమంచేందుకు జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్ సిద్ధమైంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో ఈ దిగ్గజ స్టీల్ కంపెనీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒలింపిక్స్ ఆతిథ్య నగరాల్లో అభివృద్ది చెందిన దేశాలు ఇలాంటి హౌజ్‌లను నిరమించుకోవడం సహజం. కానీ భారత్ మాత్రం ఇలాంటి అధునాతన సౌకర్యాలతో హౌజ్‌ను నిర్మించుకోవడం ఇదే మొదటిసారి. క్రీడాగ్రామానికి సమీపంలో 2200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తొలిసారి భారత్ అక్కడ ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌజ్‌ను నియమించనుంది దీనికి సంబంధించిన ‘లోగో’ను జేఎస్‌డబ్ల్యూ గురువారం విడుదల చేసింది. ఈ హౌజ్‌లో భారత క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. అలాగే అధికార వర్గాలకు సమాచార వేదిక, భారత్ నుంచి వెళ్లే ప్రేక్షకులు, మీడియా సిబ్బంది కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయి. అలాగే భారతీయ వంటకాలన్నీ అందుబాటులో ఉంచుతారు. దీని వల్ల ఇంటి భోజనానికి దూరమైన భావనే కలగదని ఐఓఏ వర్గాలు తెలిపాయి. ఈ హాస్పిటాలిటీ హౌజ్ స్థూలంగా భారత వర్గాలందరికీ సమాచార, సమన్వయ వేదికగా ఉపయోగపడుతుందని ఐఓఏ వర్గాలు తెలిపాయి. -
మా సంఘానికి ఐఓఏ గుర్తింపు ఉంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకే హక్కు ఉందంటూ... మాదంటే మా సంఘానికే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపు ఉందంటూ గత కొంతకాలంగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐఓఏ నియమించిన కమిటీ సభ్యుడైన నామ్‌దేవ్ షిర్గావోంకర్ ఆధ్వర్యంలో నిజాం కాలేజి వేదికగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సమావేశం జరిగింది. ఓఏటీ అధ్యక్ష కార్యదర్శులైన ప్రొఫెసర్ కె. రంగారావు, పి. ప్రకాశ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓఏటీ ఏర్పాటు జరిగిన విధానాన్ని నామ్‌దేవ్‌కు వివరించారు. ఐఓఏ నార్మ్, సొసైటీస్ యాక్ట్ చట్టాలకు అనుగుణంగా ఐఓఏ పరిధిలోనే 2015లో చట్టబద్ధంగా తమ సంఘాన్ని ఏర్పాటు చేశామని రంగారావు తెలిపారు. ఐఓఏ పరిధిలోనే తాము క్రీడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఓఏటీకి చట్టబద్ధత ఉందని అన్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీఓఏ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి తమ వైపు వాదనలను ఐఓఏ సభ్యుడు నామ్‌దేవ్‌కు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నామ్‌దేవ్ ఈ విషయాన్ని ఐఓఏ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ వివాదం పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఏటీ సభ్యులైన అబ్బాస్ కీర్మాణి, ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, పాణిరావు, మహేశ్ కుమార్, ఫల్గుణ, అశోక్ కుమార్, శ్రీశైలం, దీక్షిత్, లక్ష్మీకాంతం.... టీఓఏ ప్రతినిధులు కె. జగదీశ్వర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక
న్యూఢిల్లీ : మూడేళ్లుగా జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తోన్న గోవా ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా హెచ్చరించారు. ముందే చెప్పినట్లుగా ఈ నవంబర్‌లో క్రీడల్ని నిర్వహించలేకపోతే వాటిని మరో వేదికకు తరలించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ఐఓఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్రీడల నిర్వహణను నాలుగు సార్లు వాయిదా వేసిన గోవా ప్రభుత్వం తాజాగా మరోసారి ఇదే పోకడను అనుసరిస్తూ వచ్చే ఏడాది నిర్వహిస్తామంటూ కొత్త వాదనను వినిపించింది. దీంతో గోవా ప్రభుత్వ తీరుపై రాజీవ్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. ‘మా ఓపిక నశించిపోతోంది. గోవా ప్రభుత్వానికి నిబద్దత లేదనే విషయం మాకిప్పుడే అర్థమవుతోంది. ప్రతీసారి క్రీడల్ని వాయిదా వేయలేం. వేరే వేదికకు మార్చడం అనివార్యమనిపిస్తుంది’ అని అన్నారు. చివరిసారిగా 2015లో కేరళ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
సరే... అలాగే చేద్దాం
న్యూఢిల్లీ : బర్మింగ్‌హామ్ ఆతిథ్యమివ్వనున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేయాలనుకుంటున్న భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) మద్దతు పెరుగుతోంది. ఐఓఏ నిర్ణయాన్ని భారత రైఫిల్ షూటింగ్ సంఘం (ఎన్ఆర్ఏఐ) సమర్థించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెడుతున్న షూటింగ్ క్రీడను ఆ గేమ్స్ నుంచి తొలగించడంతో ఐఓఏ తీవ్ర అసంతృప్తితో ఉంది. శనివారం బాయ్‌కాట్ ప్రతిపాదనన తెరపైకి తెచ్చిన ఐఓఏ భారత ప్రభుత్వం అనుమతి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. దీన్ని ఎన్ఆర్ఏఐ స్వాగతించింది. ఈ సంఘం కార్యదర్శి రాజీవ్ భాటియా మాట్లాడుతూ ‘మేం ఐఓఏ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. ఐఓఏ అధ్యక్షుడు సమర్థంగా పనిచేస్తున్నారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌పై వారు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది’ అని అన్నారు. సెప్టెంబర్‌లో రువాండాలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) జనరల్ అసెంబ్లీకి కూడా గైర్హాజరు కావాలని ఐఓఏ నిర్ణయించింది. భారత్ పాల్గొనాలి: సీజీఎఫ్ మరోవైపు సీజీఎఫ్ భారత ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఐఓఏ నిర్ణయంపై సీజీఎఫ్ స్పందన కోరగా... ‘బర్మింగ్‌హామ్ మెగా ఈవెంట్లో భారత్‌లాంటి దేశం గైర్హాజరు కావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత బృందం పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. భారత్ అభ్యంతరాలు, అసంతృప్తులపై చర్చించేందుకు మా అధికారుల బృందం త్వరలో భారత్ వెళుతుంది. ఐఓఏను ఒప్పిస్తుంది’ అని సీజీఎఫ్ మీడియా, కమ్యూనికేషన్స్ మేనేజర్ టామ్ డెగున్ ఈ–మెయిల్ ద్వారా వివరణ ఇచ్చారు. -
సైనాను తప్పుబట్టిన గుత్తా జ్వాల!
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రికి ‘టీమ్ అఫీషియల్’ అక్రిడిటేషన్ ఇవ్వకపోతే కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగుతానని హెచ్చరించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనానెహ్వాల్‌ను ప్రముఖ డబుల్స్ షట్లర్ గుత్తా జ్వాల తప్పుబట్టారు. తాను టోర్నీలో పాల్గొనే సమయంలో తన కుటుంబ సభ్యుల హోటల్, టికెట్స్ ఖర్చులు తానే భరించానని, తనకు సైనాలా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ను బెదిరించే ఉపాయం తట్టలేదని ఈ డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సెటైర్ వేశారు. ఆటల్లో బెదరింపులు సమంజసేమేనా అని ప్రశ్నిస్తూ అంటూ ట్వీట్ చేశారు. ఇక హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. నగదుపురస్కారాలు, అవార్డుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే మాత్రం వివాదస్పదం కావు. కానీ ఆట ఆడే హక్కు గురించే ప్రశ్నిస్తే వివాదస్పదం అవుతుంది.’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. Hmmm..my family always paid for tickets n stayed in hotels...I have no idea what’s being promised n what’s the demand?? But for the games when u know dates long before the team leaves..isn’t it better to book n plan in advance? Threatening not play..is it correct?? — Gutta Jwala (@Guttajwala) 3 April 2018 Funny...how such things like demanding for money awards plots etc etc on social media doesn’t count for controversies...and when asked for right to play is controversial 😒🙄 #hypocrisytoanotherlevel — Gutta Jwala (@Guttajwala) 3 April 2018 ఇక సైనా కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని హెచ్చరిస్తూ ఐవోఏకు లేఖ రాయడం.. దీనికి వారు స్పందిస్తూ అనుమతినివ్వడం తెలిసిందే. సైనా చేసిన ఈ బ్లాక్ మెయిలింగ్ క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వం నుంచి అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఓ స్టార్ క్రీడాకారిణి దేశం కోసం ప్రతిష్టాత్మక క్రీడల్లో బరిలోకి దిగాల్సిన తరుణంలో వ్యక్తి లేదా కుటుంబ ప్రాధాన్యతతో ఉన్నపళంగా ఆడనని తెగేసి చెప్పడం తగదని పలువురు బాహటంగానే విమర్శించారు. పతకాలు గెలిచే క్రీడాకారులు ఆటపైనే ఏకాగ్రత పెట్టాలని ఆకాంక్షిస్తున్న మేం... దీన్ని వివాదాస్పదం చేయదల్చుకోలేదని ఐఓఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటా: సైనా
సాక్షి, న్యూఢిల్లీ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతాకు లేఖ రాశారు. తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖకు స్పందించిన ఐఓఏ సైనా తండ్రిని కామన్వెల్త్ గేమ్స్‌కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అతను సైనా మ్యాచ్‌లను చూడవచ్చని స్పష్టం చేసింది. ఇక అంతకు ముందు సైనా కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. తన తండ్రి మద్దతు లేకుండా తాను ఆడలేనని, అందుకే ఆయనను అన్ని మ్యాచ్‌లకు తీసుకెళ్తుంటానన్నారు. తొలుత టీమ్ అధికారిగా తన తండ్రిని ధ్రువీకరించడంతో ఆయన ఖర్చులన్నీ భరించి తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక.. తన తండ్రి పేరును టీమ్ అధికారిక జాబితా నుంచి తొలగించారని సైనా ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో రేపటి (బుధవారం) నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్న తరుణంలో సైనాకు ఇలా చేదు అనుభవం ఎదురుకావడం చర్చనీయాంశమైంది. -
కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు
వెనక్కి తగ్గిన ఐఓఏ క్రీడా మంత్రిత్వ శాఖ హర్షం నిషేధం ఎత్తివేత న్యూఢిల్లీ: తమ జీవిత కాల గౌరవ అధ్యక్షులుగా సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలా నియామకాలపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దిద్దుబాటు చర్యలకు దిగింది. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వీరిద్దరి ఎంపికపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేంద్ర క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసుతో పాటు నిషేధం కూడా విధించింది. దీంతో దారిలోకొచ్చిన ఐఓఏ... కల్మాడీ, చౌతాలా నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘గత నెల 12న చెన్నైలో జరిగిన వార్షిక సమావేశం చివర్లో ఓ సభ్యుడు ఐఓఏ ఇద్దరు జీవితకాల అధ్యక్షులను నామినేట్ చేయాలని సూచించారు. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్మానం చేయలేదు. ఓటింగ్ కూడా జరగలేదు. ఐఓఏ నియమావళి ప్రకారం సభ్యులు తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా జరగలేదు. సాంకేతికపరంగా అది చెల్లుబాటు కాదు. అయితే ఈ విషయం మొత్తంలో గందరగోళం జరిగి ఐఓఏకు, సభ్యులకు అసౌకర్యం కలిగించింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాను’ అని క్రీడా శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు స్పందిస్తూ రాసిన లేఖలో ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ పేర్కొన్నారు. ఐఓఏను దశాబ్దాలపాటు తన ఆధిపత్యంలో ఉంచుకున్న కల్మాడీ 2010 కామన్వెల్త్ గేమ్స్ అవినీతి కుంభకోణంలో నిందితుడిగా తొమ్మిది నెలల జైలు జీవితం గడిపారు. అలాగే హరియాణాలో చౌతాలా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. కళంకితులకు దూరంగా ఉండాలనే తమ నియమావళికి వ్యతిరేకంగా వీరిద్దరిని గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు ఐఓఏ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. స్వాగతించిన క్రీడా శాఖ... ఐఓఏ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో వెంటనే తాము విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఐఓఏ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కల్మాడీ, చౌతాలా ఎంపికపై వెనక్కి తగ్గే వరకు తమ నిషేధం కొనసాగుతుందని ఇంతకుముందే ప్రకటించాం. ఇప్పుడు అదే జరిగింది కాబట్టి నిషేధం తొలగినట్టే’ అని క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
వారిద్దరి సభ్యత్వాలు రద్దు!
-
వారిద్దరి సభ్యత్వాలు రద్దు!
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఎట్టకేలకు దిగివచ్చింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలా అపాయింట్మెంట్ను రద్దు చేస్తూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది. సురేష్ కల్మాడీకి జీవితకాల అధ్యక్షుడిగా పగ్గాలు అప్పచెబుతూ ఇటీవల ఐఓఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐఓఏ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. ఆ నేపథ్యంలో వారి జీవితకాల అపాయింట్లను రద్దు చేస్తూ తాజాగా ఐఓఏ నిర్ణయం తీసుకుంది. -
సస్పెండ్ చేసి మంచి పని చేశారు!
న్యూఢిల్లీ:ఇండియన్ ఒలింపిక్స్ సంఘం(ఐఓఏ)ను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత షూటర్ అభినవ్ బింద్రా సమర్ధించాడు. క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇటువంటి మంచి నిర్ణయాలు ఎంతైనా అవసరమని పేర్కొన్నాడు. ఐఓఏ పట్ల క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామానికి సంకేతమని బింద్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ వేసిన ముందడుగు కొన్ని విలువల్ని కాపాడటానికి దోహదం చేస్తుందన్నాడు. ఎక్కడైనా అవినీతి కూడిన పరిపాలన ఎంతోకాలం సాగదనడానికి ఇదే ఉదాహరణనని బింద్రా తెలిపాడు. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడా శాఖ డిమాండ్ చేసినా దాన్ని ఐఓఏ పక్కన పెట్టేసింది. దాంతో తాత్కాలికంగా ఐఓఏపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. -
'ఆ ఇద్దరి'పై ఐఓఏకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. క్రీడల మంత్రి విజయ్ గోయల్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యావశ్యకాలని, వాటికి విరుద్ధంగా ఆ ఇద్దరి(కల్మాడీ, చౌతాల) ఎంపిక జరగడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశంలో కల్మాడీ, చౌతాలలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ సంఘానికి కేంద్రం షోకాజ్ నోటీసు నేపథ్యంలో సురేశ్ కల్మాడి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 'జీవితకాల అధ్యక్ష' పదవి చేపట్టేందుకు కల్మాడీ సుముఖంగా లేరని పలు జాతీయ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే కల్మాడీగానీ, చౌతాలాగానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కల్మాడీ, చౌతాలాల నియామకానికి సంబంధించి తాము ఎవ్వరి సూచనను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బుధవారం నాటి షోకాజ్ నోటీసుపై ఆ సంస్థ స్పందన వెలువడాల్సిఉంది. (చదవండి: భారత ఒలింపిక్ సంఘం సంచలన ప్రకటన) -
నర్సింగ్కు క్లియరెన్స్ వస్తే..!
న్యూఢిల్లీ: డోపింగ్ టెస్టులో పడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై ఇంకా విచారణ కొనసాగుతోందని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) స్పష్టం చేసింది. దీనిలో భాగంగా నర్సింగ్ కు మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒకవేళ నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే నర్సింగ్ యాదవ్‌కు క్లియరెన్స్ వచ్చిన పక్షంలో అతన్ని పంపించాలా? లేదా? అనేది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు. 'ప్రస్తుతానికి 74 కేజీల విభాగంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాను పంపించేందుకు సిద్ధమయ్యాం. మరోవైపు నర్సింగ్ కేసును కూడా నాడా విచారిస్తోంది. అతనికి మరోసారి డోప్ టెస్టులు నిర్వహించనున్నారు. నర్సింగ్ కు క్లియరెన్స్ వచ్చి అతన్నే పంపాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ భావిస్తే ఆ రకంగానే చర్యలు తీసుకుంటాం. ఇందుకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐఓసీ అనేది కేవలం ఒక పోస్ట్ ఆఫీస్ లాంటింది. మేము సదుపాయాల్ని సమకూర్చే వాళ్ల మాత్రమే. డబ్యూఎఫ్ఐ రానాను పంపాలని నిర్ణయించింది కాబట్టి ఆ సమాచారాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు తెలియజేశాం'అని రాజీవ్ మెహతా తెలియజేశారు. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రానాకు రియోకు పంపేందుకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. -
సుశీల్‌కు ఇంకా అవకాశం ఉంది
► తేల్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య ► ప్రాబబుల్స్ జాబితాలో లేని రెజ్లర్ పేరు న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపింది. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సిం గ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. ఇది ప్రతిసారీ జరిగే ప్రక్రియ. అయితే ఏ విభాగంలో ఎవరు పాల్గొనాలో మా సమాఖ్య నిర్ణయించిన తర్వాత ఆ పేర్లను ఐఓఏ ఆమోదిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనిపై వివాదం అవసరం లే దు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య పేర్కొంది. మరోవైపు రె జ్లర్ల వివాదంతో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
సల్మాన్‌తో పాటు సచిన్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పంపిన ఆహ్వానానికి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అంబాసిడర్‌గా ఉండేందుకు సచిన్ సుముఖత వ్యక్తం చేస్తూ మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేశాడు. దీనివల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు భారత జట్టుకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఐఓఏ ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. అలాగే మేటి షూటర్ అభినవ్ బింద్రాను కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కూడా ఐఓఏ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది. -
సచిన్.. అంబాసిడర్‌గా వ్యవహరించండి
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. ఐఓఏ ఈ మేరకు సచిన్‌కు లేఖ రాసింది. ఐఓఏ అభ్యర్థనపై సచిన్ ఇంకా స్పందించాల్సివుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ వ్యవహరించడం వల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ను కూడా రియో బృందం చేర్చాలని ఐఓఏ భావిస్తోంది. ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు భారత జట్టుకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ నియామకంపై కొందరు క్రీడా దిగ్గజాలు విమర్శలు చేశారు. -
ఐఓఏ సభ్యత్వం తీసుకోండి:ఐబా
న్యూఢిల్లీ:కొత్తగా ఏర్పాటైన బాక్సింగ్ ఇండియా (బీఐ)ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) కోరింది. ‘ఇప్పటిదాకా భారత్‌లో బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నఅడ్‌హక్ కమిటీ మరెంతో కాలం కొనసాగదు. ఇక ఈ క్రీడకు సంబంధించి అన్ని స్థాయిల పోటీలను తమ సహకారంతో బీఐ చూసుకుంటుంది. అంతకన్నా ముందు బాక్సింగ్ ఇండియా ఐఓఏ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఏ చార్టర్‌ను అనుసరించి గుర్తింపు పొందుతుంది’ అని ‘ఐబా’ పేర్కొంది. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్యను రద్దు చేసిన అనంతరం ఈ క్రీడ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యుల అడ్‌హక్ కమిటీని నియమించింది. బాక్సింగ్ ఇండియాకు ‘ఐబా’ నుంచి తాత్కాలిక గుర్తింపు లభించడంతో బాక్సర్లు అధికారికంగా భారత్ తరఫున పాల్గొనే అవకాశం లభించింది. -
భారత ఒలింపిక్ సంఘంపై సస్పెన్షన్ ఎత్తివేత
భారత క్రీడాభిమానులకు పెద్ద ఊరట. రాబోయే ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకునే మన క్రీడాకారులు వెళ్లచ్చు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తేసింది. దాంతో దాదాపు ఏడాది నుంచి ఉన్న ఇబ్బంది తొలగిపోయినట్లయింది. ఐఓఏకు కొత్తగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ నిషేధాన్ని ఐఓసీ ఎత్తేసింది. ఆరోపణలున్న వారిని ఐఓఏలో ఎలా కొనసాగిస్తారంటూ 14 నెలల క్రితం ఐఓసీ మన ఒలింపిక్ సంఘంపై నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తమ్ముడు ఎన్.రామచంద్రన్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పుడు కొత్తగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో నిషేధాన్ని ఎత్తేసినట్లు ఐఓసీ తమకు ఫోన్ ద్వారా తెలియజేసిందని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. ఇక్కడ కొత్తగా జరిగిన ఎన్నికలను ఐఓసీకి చెందిన ముగ్గురు పరిశీలకులు కూడా ప్రత్యక్షంగా వచ్చి చూశారు. వారు సంతృప్తి చెందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సోచి ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండా
-
అవినీతి మా వైఖరి మారదు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఐఓఏ అభ్యంతరాలు పట్టించుకుంటే ఒలింపిక్ చార్టర్‌ను బలహీనపరిచినట్టవుతుందని తెలిపింది. పలు సూచనలతో ఇటీవలే భారత ఒలింపిక్ సంఘం రాజ్యాంగాన్ని ఐఓసీ సవరించింది. దీంట్లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారిపై ఉక్కుపాదం మోపింది. వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఐఓసీ ఎన్నికల్లో పాల్గొనే వీల్లేదని తేల్చింది. అయితే ఈ నిబంధనను ఐఓసీ వ్యతిరేకిస్తోంది. భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఆరోపణలు తదనంతరం తేలిపోవచ్చని వాదిస్తోంది. అయితే ఐఓఏ మాత్రం తన వైఖరిపై గట్టిగానే ఉంది. అలాగే సవరించిన ఐఓఏ రాజ్యాంగ ముసాయిదాలో తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను కుదించుకోవాలని ఐఓసీ సూచించింది. ఈ సంఖ్యను 19కి తగ్గిస్తే, మంచి పాలన వీలవుతుందని ఐఓసీకి రాసిన లేఖలో పేర్కొంది. ‘బలవంతం చేయకూడదు’ ఈ వ్యవహారంపై మరోసారి ఐఓసీకి లేఖ రాయాలనే ఆలోచనలో ఐఓఏ ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 25న జనరల్ బాడీ సమావేశం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడగనుంది. ‘ఒకటి రెండు రోజుల్లో ఐఓసీకి మరో లేఖ రాయాలని అనుకుంటున్నాం. వారి చర్యపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉంది. చార్జిషీట్‌ను ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని భారత చట్టం కూడా అడ్డుచెప్పడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాంటి వారు పోటీ చేస్తున్నారు’ అని ఐఓఏ అధికారి ఒకరు తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై బింద్రా హర్షంభారత ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అవినీతి మచ్చ పడిన వారికి చోటు లేదన్న ఐఓసీ నిర్ణయంపై ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా హర్షం వ్యక్తం చేశాడు.