నాపై వేటువేయడానికి ఏఐబీఏ ఎవరు? | Sumariwala slams AIBA, says it has no jurisdiction to ban him | Sakshi
Sakshi News home page

నాపై వేటువేయడానికి ఏఐబీఏ ఎవరు?

Published Mon, Oct 27 2014 7:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

Sumariwala slams AIBA, says it has no jurisdiction to ban him

న్యూఢిల్లీ: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన తనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నిషేధం విధించడంపై  అదిలి జె సుమారివాలా మండిపడ్డాడు. భారత మహిళా బాక్సర్ సరితా దేవీ తాను గెలిచిన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేయడంతో ఆమెతో పాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, అదిలి జె సుమారివాలాపై  ఏఐబీఏ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి గళం విప్పిన సుమారివాలా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు  ఈ అంశానికి సంబంధించి ఎటువంటి విచారణ లేకుండానే తనపై నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించాడు.

 

'నాపై వేటు వేయడానికి ఏఐబీఏ ఎవరు? ఆ గేమ్స్ లో భారత్ బాక్సింగ్ పెద్దగా వెళ్లాను. అక్కడ క్రీడాకారులకు అన్ని విధాల సాయపడి నా పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాను' అని తెలిపారు. తన నిషేధానికి సంబంధించి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అది ఏమైనా కార్యక్రమమా?లేక పోటీని అనే విషయం తనకు తెలియడం లేదన్నారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న సుమారివాలా భవిష్యత్తులో బాక్సింగ్ పోటీలకు గాను తాను అధికారికంగా ఎటువంటి బాధ్యత తీసుకోబోనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement