Adille Sumariwala
-
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా
Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్ ఆదిల్ సుమారివాలా ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాల చేత మాజీ అధ్యక్షుడు నరిందర్ బత్రా రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సుమారివాలా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు జరిగే వరకు సుమారివాలా ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు సుమారివాలా అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఈ నియామకం జరిగినట్లు ఐవోఏ వెల్లడించింది. కాగా, భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో ఓ ఒలింపియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదిల్ సుమారివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో (100 మీటర్ల రన్నింగ్) ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత -
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు... కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు. -
నాపై వేటువేయడానికి ఏఐబీఏ ఎవరు?
న్యూఢిల్లీ: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన తనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నిషేధం విధించడంపై అదిలి జె సుమారివాలా మండిపడ్డాడు. భారత మహిళా బాక్సర్ సరితా దేవీ తాను గెలిచిన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేయడంతో ఆమెతో పాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, అదిలి జె సుమారివాలాపై ఏఐబీఏ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి గళం విప్పిన సుమారివాలా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి విచారణ లేకుండానే తనపై నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించాడు. 'నాపై వేటు వేయడానికి ఏఐబీఏ ఎవరు? ఆ గేమ్స్ లో భారత్ బాక్సింగ్ పెద్దగా వెళ్లాను. అక్కడ క్రీడాకారులకు అన్ని విధాల సాయపడి నా పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాను' అని తెలిపారు. తన నిషేధానికి సంబంధించి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అది ఏమైనా కార్యక్రమమా?లేక పోటీని అనే విషయం తనకు తెలియడం లేదన్నారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న సుమారివాలా భవిష్యత్తులో బాక్సింగ్ పోటీలకు గాను తాను అధికారికంగా ఎటువంటి బాధ్యత తీసుకోబోనని తెలిపారు.