India woman boxer
-
బాక్సర్ సరితపై నిషేదం.. ఏడాది పాటే..!
-
నాపై వేటువేయడానికి ఏఐబీఏ ఎవరు?
న్యూఢిల్లీ: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన తనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నిషేధం విధించడంపై అదిలి జె సుమారివాలా మండిపడ్డాడు. భారత మహిళా బాక్సర్ సరితా దేవీ తాను గెలిచిన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేయడంతో ఆమెతో పాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, అదిలి జె సుమారివాలాపై ఏఐబీఏ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి గళం విప్పిన సుమారివాలా అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి విచారణ లేకుండానే తనపై నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించాడు. 'నాపై వేటు వేయడానికి ఏఐబీఏ ఎవరు? ఆ గేమ్స్ లో భారత్ బాక్సింగ్ పెద్దగా వెళ్లాను. అక్కడ క్రీడాకారులకు అన్ని విధాల సాయపడి నా పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాను' అని తెలిపారు. తన నిషేధానికి సంబంధించి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అది ఏమైనా కార్యక్రమమా?లేక పోటీని అనే విషయం తనకు తెలియడం లేదన్నారు. ప్రస్తుతం భారత అథ్లెటిక్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న సుమారివాలా భవిష్యత్తులో బాక్సింగ్ పోటీలకు గాను తాను అధికారికంగా ఎటువంటి బాధ్యత తీసుకోబోనని తెలిపారు. -
'సరితపై సస్పెన్షన్ తొలగించండి'
న్యూఢిల్లీ: మహిళా బాక్సర్ సరితా దేవిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ)ను భారత బాక్సింగ్ అధ్యక్షుడు సందీప్ జజోడియా కోరారు. ఆమె ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. సరితాదేవి గతంలో ఎప్పుడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమెపై సస్సెన్షన్ తొలగించాలని ఏఐబీఏకు విజ్ఞప్తి చేశారు. ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ సరితా దేవిపై ఏఐబీఏ ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది. -
సరితా దేవీపై సస్పెన్షన్ వేటు!
-
సరితాదేవికి షాక్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) ఆమెపై ఈ చర్య తీసుకుంది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను ఏఐబీఏ సస్పెండ్ చేసింది. ఫలితంగా అన్నిరకాల పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం ఉంటుంది. బాక్సింగ్ కు సంబంధించిన సమావేశాల్లోనూ ఆమెకు ప్రవేశం ఉండదు. సరితాదేవి కోచ్ లు గురుబక్ష్ సింగ్ సాంధు, ఫెర్నాడెంజ్, సాగర్ మాల్ దయాల్ పై కూడా వేటు పడింది. ఆసియా క్రీడల్లో సెమీఫైనల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి సరితాదేవి తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది.