సరితా దేవి(ఫైల్)
న్యూఢిల్లీ: మహిళా బాక్సర్ సరితా దేవిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ)ను భారత బాక్సింగ్ అధ్యక్షుడు సందీప్ జజోడియా కోరారు. ఆమె ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. సరితాదేవి గతంలో ఎప్పుడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమెపై సస్సెన్షన్ తొలగించాలని ఏఐబీఏకు విజ్ఞప్తి చేశారు.
ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ సరితా దేవిపై ఏఐబీఏ ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ఫెర్నాండెజ్, సాగర్ మాల్ దయాల్, గేమ్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన అదిలి జె సుమారివాలాపై కూడా సస్పెన్షన్ విధించింది.