సరితాదేవి , సచిన్ టెండూల్కర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నుంచి నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ ఎల్.సరితా దేవికి రాజ్యసభ సభ్యుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఇంచియాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో సరిత తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఏఐబీఏ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సచిన్ ఈరోజు కేంద్ర క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ను కలిశారు. సరితాదేవి భవిష్యత్ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంతో చర్చించి సరితపై చర్యలు లేకుండా చేయాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. సచిన్ బాటలోనే సరితకు అండగా నిలుస్తానని బాక్సర్ విజేందర్తోపాటు పలువురు క్రీడాకారులు ప్రకటించారు. భారత ప్రభుత్వం తరపున ఈ విషయం తాము ఏఐబీఏతో చర్చిస్తామని మంత్రి సర్బానందా సోనోవాల్ హామీ ఇచ్చారు. భారత ప్రజలు సరితాదేవికి అండగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సరితాదేవిపై నిషేధం ఎత్తివేసేందుకు తాను కృషి చేస్తానని మంత్రి చెప్పారు.
**