బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం | Mary Kom To Skip World Championships And Asian Games 2022 | Sakshi
Sakshi News home page

Mary Kom: బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం

Published Sun, Mar 6 2022 8:57 PM | Last Updated on Sun, Mar 6 2022 10:27 PM

Mary Kom To Skip World Championships And Asian Games 2022 - Sakshi

Mary Kom To Skip World Championships And Asian Games: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యువ తరానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్‌వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. 

ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి లేఖ ద్వారా తెలియజేసింది. మేరీ కోమ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కాగా, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈ ఏడాది మే 6 నుంచి 21 వరకు టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరగనున్నాయి. అలాగే, జులై 28 నుంచి కామన్‌వెల్త్ క్రీడలు, సెప్టెంబరు 10 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.
చదవండి: IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్‌ రాయల్స్‌తో మొదలై..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement