న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చరిత్ర సృష్టించారు. మంగళవారం జరిగిన పోటీల్లో 35 ఏళ్ల మేరీ కోమ్ సంచలన ప్రదర్శన చేసిన మేరీకోమ్ సెమీ ఫైనల్లో ప్రవేశించారు. 48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో వుయ్(చైనా)పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని మేరీకోమ్ తన ఖాతాలో వేసుకున్నారు.
అదే సమయంలో ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడో పతకాన్ని మేరీకోమ్ సాధించారు. ఈ క్రమంలోనే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా అరుదైన రికార్డు సృష్టించారు మేరీకోమ్.ఓవరాల్ ఈ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ 5స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2010లో 48 కేజీలో కేటగిరీలో ఆమె స్వర్ణాన్ని సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment