మరోసారి తన టాలెంట్‌తో అదరగొట్టిన నటి | Watch video Of Raashi Khanna Guitar Performance | Sakshi
Sakshi News home page

గిటార్‌తో అదరగొట్టిన రాశీఖన్నా

Published Tue, May 26 2020 8:27 PM | Last Updated on Tue, May 26 2020 8:30 PM

Watch video Of Raashi Khanna Guitar Performance - Sakshi

సినిమాల్లో తన అద్బుత అభినయంతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా తాజాగా గిటార్‌తో అద్భుత నైపుణ్యం కనబరిచింది. లాక్‌డౌన్‌ వేళ ఈ పంజాబీ సొగసరి గిటార్‌ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్స్‌కు విరామం దొరకడంతో రాశీఖన్నా ఇన్‌స్టా వేదికగా గిటార్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. తనకు ఎంతో ఇష్టమైన 'గెట్‌ యూ ద మూన్‌' అనే సాంగ్‌ను గిటార్‌ ప్లే చేస్తూ పాడింది. ' గెట్‌ యూ ద మూన్‌ సాంగ్‌ నాకు చాలా ఇష్టం. అయితే గిటార్‌ ప్లే చేయడం నేను చాలా ఇంట్రస్ట్‌గా భావిస్తాను. ఇప్పుడిప్పుడే గిటార్‌ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటున్నాను. నాకున్న ఈ అభిరుచి నన్ను మరింత పాజిటివ్‌గా మార్చింది. నేను ఎప్పుడు గిటార్‌ పట్టుకున్నా.. నా ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. నేను చేసిన ఈ వీడియో మీఅందరికి నచ్చుతుందనే అనుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. దీంతో పాట లిరిక్స్‌ను క్యాప్షన్‌లో జత చేశారు. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పటికే 98వేల లైకులను సాధించింది.

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాశిఖన్నా సుప్రీమ్‌, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, బెంగాల్‌ టైగర్‌, జై లవకుశ లాంటి హిట్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాశీఖన్నా హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్‌కమింగ్‌ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్‌ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్‌ చేసింది.
కరోనా : భయం పుట్టిస్తున్న వర్మ సినిమా 
టీవీ న‌టి ఆత్మ‌హ‌త్య

I always wanted to learn how to play a guitar & I am still at the very beginning learning my way through.. Inculcating this habit has really helped me stay positive.. 😇 Every time I hold a guitar. It brings a smile to my face! Hope this video brightens your day in whatever little way possible.. and here are the lyrics of this song that I love! You gave me a shoulder, when I needed it.. You showed me love, when I wasn't feeling it.. You helped me fight, when I was giving in.. You made me laugh, when I was losing it.. 'Cause you are, you are The reason why I'm still hanging on 'Cause you are, you are The reason why my head is still above water.. And if I could get you the moon I’d give it to you.. And if death was coming for you I'd give my life for you.. Video editing credit @nawinvijayakrishna 🤗

A post shared by Raashi (@raashikhannaoffl) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement