Naveen Polishetty: ‘జాతిరత్నం’ పెద్దమనసు.. ఆ యువకుడికి ఉద్యోగం | Sameer Gets a Job With the Help of Naveen Polishetty | Sakshi
Sakshi News home page

Naveen Polishetty: పెద్ద మనసు చాటుకున్న జాతిరత్నం..యువకుడికి ఉద్యోగం

Published Tue, Aug 3 2021 6:51 PM | Last Updated on Tue, Aug 3 2021 7:27 PM

Sameer Gets a Job With the Help of Naveen Polishetty - Sakshi

కరోనా కష్టకాలంలో యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి అభిమానులకు అండగా ఉంటున్నాడు. బాధల్లో ఉన్నవారితో ఫోన్‌లొ మాట్లాడడమే కాకుండా.. తనకు తోచిన సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్‌ అనే వ్యక్తికి ఒక్క ట్వీట్‌తో జాబ్‌ ఇప్పించాడు ఈ ‘జాతిరత్నం’. లాక్‌డౌన్‌ సమయంలో జాబ్‌ కోల్పోయిన ఇబ్బంది పడుతున్న సమీర్‌ గురించి నవీన్‌ పొలిశెట్టికి తెలియగానే.. ఆ యువకుడి వివరాలను ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఉద్యోగం ఉంటే చెప్పండని కోరాడు. నవీన​ ట్వీట్‌కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్‌కు స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ.. సమీర్‌కు వచ్చిన ఆఫర్‌ లెటర్‌ని పోస్ట్‌ చేశాడు నవీన్‌. 

సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్యలకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్‌కు తాను వెళ్తానని చెప్పాడు. అలాగే పాండమిక్ టైమ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement