Raasi Khanna
-
క్లాసిక్ గోల్డ్ బనారసీ చీరలో అందాల ‘రాశి’ (ఫోటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్‌లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
అలాంటి చిత్రాల్లో నటించాలని ఉంది: రాశి ఖన్నా
తమిళసినిమా: బహు భాషా నటిగా ఎదుగుతున్న నటి రాశీఖన్నా. ఈ హైదరాబాదీ బ్యూటీ గ్లామరస్ పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి పాత్రలతోనే గుర్తింపు పొందింది. తెలుగులో కొన్ని సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటించిన రాశీఖన్నా, తమిళంలో నటి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత జయంరవి సరసన అడంగు మరు చిత్రం, అయోగ్య, అరణ్మణై 3, తిరుచిట్రం ఫలం, సర్ధార్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ పాన్ ఇండియా నటిగా ఎదుగుతోంది. కాగా ఇటీవల ఓ భేటీలో ప్రేమ కథా చిత్రాల గురించి స్పందిస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలేనని పేర్కొంది. ఆ తరహా చిత్రాలు ఎప్పటికీ బోర్ కొట్టవని చెప్పింది. తనకు వైవిధ్యభరిత చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉందని తెలిపింది. ఆషీకీ వంటి మనసును హత్తుకునే ప్రేమ కథా చిత్రం చేయాలన్నది తన చిరకాల వాంఛ అని చెప్పింది. -
‘మనీ హేస్ట్’ సిరీస్‌ను తలపిస్తున్న షాహిద్ ‘ఫర్జీ’ ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఫర్జీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైం వీడియోస్. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చూట్టు కథ తిరుగనుందని తెలుస్తోంది. ‘నేను ఎంత డబ్బు సంపాదించాలంటే.. ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటూ షాహిద్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా పెంచుతోంది. దొంగ నోట్లు ముద్రించే యువకుడిగా షాహిద్ ఇందులో కనిపంచనున్నాడు. ఇక ఫర్జీ ట్రైలర్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మనీ హేస్ట్ ఇంగ్లీష్ సిరీస్‌ను తలపిస్తోంది. చదవండి: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకులు రాజ్-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఎంతో అభిరుచితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించామని, ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు కేకే మేనన్, రాశీఖన్నాలు మరో కీలక పాత్రలు పోషించారు. -
‘థ్యాంక్ యూ’ నుంచి మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా చై విభిన్న లుక్‌లో అలరించనున్నాడు. రాశీఖన్నా, మళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్ ఓ కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడదులై టీజర్, పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఏంటో ఏంటేంటో అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగ చైతన్య, మాళవిక నాయర్ల మధ్య తెరకెక్కిన ఈ పాటకు ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్ స్వరాలను సమకూర్చారు. కాగా శ్రీవెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
ఆసక్తిగా నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ టీజర్
Thank You Movie Teaser Out: అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్ నటిస్తుండగా.. అవిక గోర్ కీ రోల్ పోషిస్తోంది. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. చదవండి: ముంబై కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం! ఈ టీజర్ చూస్తుంటే చై విభిన్న పాత్రల్లో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. కాగా లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ చై చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. టీజర్ చివరిలో ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్నా ప్రయాణమే..’ అని చై చెప్పిన డైలాగ్ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేవాలను రూపొందిన థ్యాంక్యూ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, బీవీఎస్ రవి కథ, పీసీ శ్రీరామ్ ఫొటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి -
ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా
Rashi Khanna Clarity On Her Comments Over South Industry: ప్రస్తుతం రాశీ ఖన్నా దక్షిణాది ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీనికి కారణంగా ఇటీవల సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే. సౌత్ సినిమాలు రొటిన్‌గా ఉంటాయని, అక్కడ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాశీ ఖన్నాపై దక్షిణాది ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీ కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు, స్టార్డమ్ ఇచ్చిన దక్షిణాది పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు ఆమెకు క్లాస్ పీకుతున్నారు. చదవండి: యాక్షన్ ఫిల్మ్స్ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్ సినిమాలే..: వరుణ్ తేజ్ ఇక తనపై వస్తున్న వ్యతిరేకతను చూసి రశీ దిగొచ్చింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. దక్షిణాది పరిశ్రమపై తాను విమర్శ వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘నేను సౌత్ ఇండస్ట్రీని దూషించలేదు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు సమానమే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేనంటే గిట్టని వాళ్లు ఎవరో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఇది ఆపండి. దయ చేసి నాపై వస్తున్న ఈ వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నా’ అంటూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్‌బాస్ బ్యూటీ కాగా ఇటీవల హిందీలో ఆమె నటించిన రుద్ర వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ‘దక్షిణాది సినిమాలు రొటిన్‌గా ఉంటాయి. అది నాకు నచ్చకపోయిన చెయాల్సి వచ్చింది. అలా రొటిన్‌కు అలవాటు పడిపోయాను. అక్కడ హీరోయిన్‌కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలా కనిపించి ఇలా కనుమరుగైపోతుంది. అంతేకాదు అక్కడ హీరోయిన్లకు మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్లు కూడా ఇస్తారు. ఇది నాకు అసలు నచ్చని విషయం. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఇకపై మీరు ఓ కొత్త రాశీని చూస్తారు’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి. 🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY — Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022 -
నాగ చైతన్య సినిమాపై పుకార్లు, మేకర్స్ క్లారిటీ
అక్కినేని హీరో నాగ చైతన్య చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చై ‘థ్యాంక్యూ, బంగార్రాజు’ చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. లవ్‌స్టోరీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న చైతన్య వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తూ ఫుల్ బిజీ మారాడు. ఈ క్రమంలో చైతన్య నటిస్తున్న థ్యాంక్యూ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ మూవీపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! థ్యాంక్యూ మూవీని ఓటీటీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో మంచి ఫ్యాన్సీ రేటుకు డీల్ కుదరిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై థ్యాంక్యూ మూవీ టీం స్పందించింది. సమయం వచ్చినప్పుడు చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, మూవీ థియేటర్లో మంచి వినోదం పంచుతుందంటూ పుకార్లకు చెక్ పెట్టారు మేకర్స్. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటీటీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని సమాచారం. #ThankYouTheMovie will release only in theaters. pic.twitter.com/M3i7N9qw7J — Sri Venkateswara Creations (@SVC_official) December 8, 2021 -
హల్చల్: హై బన్‌తో పూనమ్.. ప్రేమలో హీనా
► ఎమోజీల ఫీల్ అవుతున్న అనన్య పాండే ► హై బన్‌తో పూనమ్ కౌర్ ► వైట్ డ్రెస్‌లో హీనా ఖాన్.. ► మాట నిలబెట్టుకున్న లైగర్..సంతోషంలో షణ్ముఖ ప్రియ ► కూతురితో నటి సమీరా రీల్స్ సందడి ► ఒంటరిగా అభిజీత్ ప్రయాణం View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shanmukhapriya (@shanmukhapriya_1925) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
మరోసారి తన టాలెంట్‌తో అదరగొట్టిన నటి
సినిమాల్లో తన అద్బుత అభినయంతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా తాజాగా గిటార్‌తో అద్భుత నైపుణ్యం కనబరిచింది. లాక్డౌన్ వేళ ఈ పంజాబీ సొగసరి గిటార్ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్స్‌కు విరామం దొరకడంతో రాశీఖన్నా ఇన్‌స్టా వేదికగా గిటార్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. తనకు ఎంతో ఇష్టమైన 'గెట్ యూ ద మూన్' అనే సాంగ్‌ను గిటార్ ప్లే చేస్తూ పాడింది. ' గెట్ యూ ద మూన్ సాంగ్ నాకు చాలా ఇష్టం. అయితే గిటార్ ప్లే చేయడం నేను చాలా ఇంట్రస్ట్‌గా భావిస్తాను. ఇప్పుడిప్పుడే గిటార్ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటున్నాను. నాకున్న ఈ అభిరుచి నన్ను మరింత పాజిటివ్‌గా మార్చింది. నేను ఎప్పుడు గిటార్ పట్టుకున్నా.. నా ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. నేను చేసిన ఈ వీడియో మీఅందరికి నచ్చుతుందనే అనుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. దీంతో పాట లిరిక్స్‌ను క్యాప్షన్‌లో జత చేశారు. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పటికే 98వేల లైకులను సాధించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాశిఖన్నా సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, బెంగాల్ టైగర్, జై లవకుశ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాశీఖన్నా హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్‌కమింగ్ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్ చేసింది. కరోనా : భయం పుట్టిస్తున్న వర్మ సినిమా టీవీ నటి ఆత్మహత్య View this post on Instagram I always wanted to learn how to play a guitar & I am still at the very beginning learning my way through.. Inculcating this habit has really helped me stay positive.. 😇 Every time I hold a guitar. It brings a smile to my face! Hope this video brightens your day in whatever little way possible.. and here are the lyrics of this song that I love! You gave me a shoulder, when I needed it.. You showed me love, when I wasn't feeling it.. You helped me fight, when I was giving in.. You made me laugh, when I was losing it.. 'Cause you are, you are The reason why I'm still hanging on 'Cause you are, you are The reason why my head is still above water.. And if I could get you the moon I’d give it to you.. And if death was coming for you I'd give my life for you.. Video editing credit @nawinvijayakrishna 🤗 A post shared by Raashi (@raashikhannaoffl) on May 24, 2020 at 5:05am PDT -
ప్రేమ పండగ
-
ప్రేమ కథ పట్టాలెక్కింది
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ముహూర్తం జరుపుకుంది. ఈ సినిమాను క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు సమర్పణలో కేఎస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లె హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. హీరో, హీరోయిన్స్‌పై కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అశ్వినీదత్, బీవీఎస్ఎన్ ప్రసాద్, సి. కల్యాణ్, దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
బిగ్ ‘సి’లో ‘హానర్ 9ఎన్’ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్ ‘సి’లో ప్రఖ్యాత ఇ–బ్రాండ్ ‘హానర్ 9ఎన్ 4+128 జీబీ’ స్మార్ట్‌పోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బిగ్ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్ రాశిఖన్నా ఈ మొబైల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిగ్ ‘సి’ ఫౌండర్, సీఎండీ ఎం బాలు చౌదరితోపాటు యూటీఎల్ ఎండీ సుధీర్ హాసిజ, ఎల్‌ఎఫ్‌ఆర్ బిజినెస్ సంస్థ డైరెక్టర్ హితేష్ శర్మ, బిగ్ ‘సి’ డైరెక్టర్లు వై స్వప్న కుమార్, జీ బాలాజీ రెడ్డి, ఆర్ గౌతమ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ, ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఒకే ధర ఉందని తెలిపారు. రూ.17,999 ధరకు సఫైర్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. -
ఈ వారం యూట్యుబ్ హిట్స్
జీనియస్ (హిందీ) – అఫీషియల్ టీజర్ నిడివి : 3 ని. 20 సె. హిట్స్ :1,03,95,447 దర్శకుడు అనిల్ శర్మ పేరు వింటే అందరికీ ‘గదర్’ సినిమా గుర్తుకు వస్తుంది. సన్ని డియోల్, అమిషా పటేల్ నటించిన ఆ సినిమా దేశభక్తి–ప్రేమ కథాంశంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకుని అనిల్ శర్మ తన కుమారుడు ఉత్కర్ష్ శర్మను ‘జీనియస్’ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దేశభక్తుడైన ఒక కుర్రాడు ప్రేమ కోసం దేశం కోసం ఏం చేశాడన్నది లైన్. విలన్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. ఒక పాపులర్ ఫిల్మ్‌లో ఎంత హంగు ఆర్భాటం ఉండాలో అంతా ఈ సినిమాలో కనపడుతోంది. ఇషితా చౌషాన్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 24 విడుదల. శ్రీనివాస కల్యాణం – టీజర్ నిడివి 38 సె. హిట్స్ :28,62,492 ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా వచ్చింది. హిట్ అయ్యింది. నిర్మాత మురారి తీసిన సినిమా అది. అలాంటి మంచి చిత్రాలు తీసే నిర్మాతగా పేరు గడించిన దిల్ రాజు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఈ మధ్య హీరో నితిన్‌కు సరైన సినిమాలు పడలేదు. హిట్ అవుతాయనుకున్న సినిమాలు కూడా నిరాశ పరిచాయి. కాని కొన్ని గ్యారంటీ సెంటిమెంట్లు ఉన్న సినిమాలు హిట్ అవుతాయన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా చేసినట్టున్నారు. దర్శకుడు సతీష్ ‘శతమానం భవతి’తో తన టేస్ట్‌ను నిరూపించుకున్నారు కనుక ఈ సినిమాను కూడా అందంగా తీర్చిదిద్ది ఉంటారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. కనుక సినిమా మంచి ఫలితాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. మాటరాని మౌనమిది – షార్ట్‌ఫిల్మ్ నిడివి :9 ని. 56 సె. హిట్స్ :1,50,112 అబ్బాయిల జీవితంలో అత్యంత ఫ్యాన్సీ నిండిన విషయం ఒకే ఒకటి – అమ్మాయిలతో మాట్లాడటం. కొందరు మంచినీళ్లు తాగినంత సులువుగా అమ్మాలను మాటల బుట్టలో పడేస్తారు. కొందరు మాత్రం కాలకూట విషం మింగుతున్నట్టుగా గడియకొకమాట మాట్లాడి అమ్మాయిలకు ఆన్ ది స్పాట్ నరకం చూపిస్తారు. సాధారణంగా మాటల కోసం తడముకునే అబ్బాయిలకు సాయం పట్టడానికి క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి గైడ్ల అవతారం ఎత్తుతుంటారు. గైడ్ల థియరీ ప్రాక్టికల్స్‌లో బెడిసి కొడుతూ ఉంటుంది. ఇదంతా పాత వ్యవహారమే అయినా చూసిన ప్రతిసారీ చిన్న చిరునవ్వు వస్తుంటుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ కూడా అలాంటి నవ్వులు పూయిస్తుంది. ‘క్రేజీ ఖన్నా’ పేరుతో ఉన్న యూ ట్యూబ్ చానల్ కోసం రాజేష్ ఖన్నా ముఖ్యపాత్రధారిగా ఈ షార్ట్‌ఫిల్మ్ తయారైంది. హర్షిత ఫిమేల్ లీడ్ చేసింది. సరదాగా చూడొచ్చు. -
స్టార్ యోగ
సినిమా స్టార్లు బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటే మైండ్ అండ్ బాడీ అంత ఫ్రెష్‌గా ఉండాలి. ఫీల్డ్ అలాంటిది. అందుకే కాజల్, రాశీఖన్నా, అదాశర్మ, సంజన.. తమ డైలీ లైఫ్‌లో యోగాకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు యోగా. ఆ తర్వాతే మిగతా షెడ్యూల్స్. ఎక్కడికెళ్లినా యోగా మ్యాట్: కాజల్ చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే, ఐ హేట్ పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్. కానీ మార్చ్ ఫాస్ట్ అంటే ఇష్టంగా చేసేదాన్ని. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్ మీద అవగాహన ఏర్పడింది. ఫస్ట్ నేను ఏరోబిక్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత జిమ్‌కు వెళ్లటం స్టార్ట్ చేశాను. ఓసారి యోగా ట్రై చేశాను. అంతే.. అప్పటినుండి యోగా నా జీవితంలో భాగమైపోయింది. బేసికల్లీ నేను ఫుడ్ లవర్ని. ఎంత ఇంట్రెస్ట్‌గా తింటానో ఫిట్నెస్ కోసం అంతే ఇష్టంగా వర్కవుట్ చేస్తాను. యోగా చేస్తే చాలు.. కేలరీలు ఇట్టే కరిగిపోతాయి.యోగా చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏవీ అవసరంలేదు. అది అందరికీ తెలిసిందే. మనకు కావాల్సింది జస్ట్ ఒక్క యోగా మ్యాట్ మాత్రమే. నేను ఎక్కడికెళ్లినా నాతో పాటు యోగా మ్యాట్ని కంపల్సరీ తీసుకెళతాను. సో.. నో బ్రేక్ ఫర్ యోగా. వారానికి మూడు రోజులు రోజుకు గంటన్నర చొప్పున తప్పనిసరిగా యోగా చే స్తాను. వారంలో మరో మూడు రోజులు వెయిట్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తాను. సూర్య నమస్కారాలు బెస్ట్. నేను రోజూ ఏ ఆసనం వేసినా వేయకపోయినా సూర్య నమస్కారాలు మాత్రం మానను. 150 సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తాను. నా ఫిట్నెస్ సీక్రెట్స్లో యోగాకి ఫస్ట్ ప్లేస్. టీనేజ్ నుంచే: రాశీ ఖన్నా యోగా గొప్పదనం గురించి నా టీనేజ్లోనే నేను తెలుసుకున్నాను. నేను యోగా చేయడం మొదలుపెట్టినప్పుడు నా వయసు9 16. అప్పటినుంచి ఇప్పటివరకూ యోగా చేస్తున్నాను. యోగా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనసు, శరీరం రెంటికీ మంచిది. నిజానికి యోగా అంటే బరువు తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. అయితే అది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.సూర్య నమస్కారాలు నా ఫేవరెట్ ఆసనం. ఈ అసనంవల్ల శరీరంలో అన్ని కండరాల్లో కదలిక వస్తుంది.యోగా వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంత త్వరగా దేనికీ హర్ట్ అవ్వం.ఆ మధ్య నేను కొంత బరువు తగ్గాను. దానికి ముఖ్య కారణం యోగా. ఆ టైమ్‌లో వాకింగ్ కూడా బాగా చేశాన.నాది నైట్ టు ఫైవ్ జాబ్ కాదు. కొన్నిసార్లు రోజుకి 12, 13 గంటలు షూటింగ్ చేస్తుంటాను. అప్పుడు కూడా నాకు అలుపు అనిపించదు. దానికి ఒక కారణం యోగా. ఉదయం ఓ గంట సేను చేసే యోగా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. నా గురువు మా అమ్మగారే: అదాశర్మ నాకు యోగాను పరిచయం చేసింది మా అమ్మగారే. నా చిన్నప్పుడు మా అమ్మగారు రోజూ యోగా చేయడం చూశాను. మెల్లిగా నాకూ అలవాటు చేశారు. నా యోగా గురువు మా అమ్మగారే.యోగాతో పాటు నేను వేరే ఎక్సర్సైజులు కూడా చేస్తాను. అయితే అవి చేసే ముందు యోగా చేస్తాను.నేను సూర్య నమస్కారాలు బాగా చేస్తాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించేది. అలవాటైన తర్వాత సూర నమస్కారాలు చేయని రోజున చాలా వెలితిగా ఉంటుంది.యోగాలో మెడిటేషన్ ఓ భాగం. ధాన్యం చేసి చూడండి. ఏకాగ్రత పెరుగుతుంది.నేను వెజిటేరియన్‌ని. అంతకు మించిన హెల్దీ ఫుడ్ లేదని నా ఒపీనియన్.ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా మైండ్ చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దానికి కారణం యోగానే.ప్రతి రోజూ ఉదయం యోగా చేయడానికి ట్రై చేయండి. రోజంతా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మనసు శరీరం బాగుంటాయి: సంజన యోగా నా జీవితం. యోగా వల్లే నేను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. అంతా బాగున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. బాధలో ఉన్నప్పుడు కూడా నాకు సంతోషం ఇచ్చేది యోగానే.యోగా చేసేవారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే.. ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. మానసికంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిచేయటానికి ఎక్కువ ధైర్యం ఉంటుంది.నా జీవితంలో యోగా అన్నది ఓ పెద్ద పార్ట్. నాకు సొంత యోగా అకాడమీ (అక్షర్) ఉంది. బెంగళూర్‌లో మూడు యోగా అకాడమీలతో స్టార్ట్ చేసి, ఇప్పుడు మొత్తం 20 అకాడమీలు నిర్వహిస్తున్నాం. ప్రతి అకాడమీలో 500 నుంచి 600 మంది క్లైంట్స్ ఉన్నారు. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, ఇలా పాజిటివ్ కోర్స్లతో ఎంతోమందికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాం. మా ‘అక్షర్’ యోగాకి ఇప్పుటికి పదేళ్లు అయింది. యోగా అనేది నాకు డబ్బు సంపాదన కాదు. నా జీవితం నడవడానికి, డబ్బు సంపాదించటానికి సినిమాలు చేస్తాను కానీ, యోగా మాత్రం నా ఆత్మతృప్తి కోసం చేస్తా. మనవల్ల ఎంతో మంది బాగుండాలనే ఒక మంచి మనసుతో యోగా అకాడమీ పెట్టాను. యోగా పట్ల నాకు ఎంత ప్రేమ, భక్తి ఉన్నాయో నేను వేసే ఆసనాలను గమనిస్తే అర్థమవుతుంది. నేను చేసే అసనాలకు సంబంధించిన ఫొటోలు చూసి, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అయితే అలాంటి ఆసనాలు ట్రైనర్ లేకుండా ఇంట్లో ట్రై చేయకూడదు అనుభవం సంపాదించుకునేంతవరకూ ట్రైన్ సమక్షంలో చేయడమే బెటర్.యోగా చేస్తున్నవాళ్లు ఎప్పటికీ కంటిన్యూ చేయండి. చేయనివాళ్లు ఈరోజు నుంచి మొదలుపెట్టండి. మనసు, శరీరం రెండూ బాగుంటాయి. -
బుడ్డోడు ముద్దొస్తున్నాడు!
ముద్దుకు మరింత ముద్దొచ్చింది... బుడ్డోణ్ణి చూడగానే! మరి, ముద్దుగుమ్మ రాశీ ఖన్నా మాత్రం ఎందుకు ఊరుకుంటారు? వెంటనే చేతుల్లోకి తీసుకుని బుగ్గలపై ముద్దులిచ్చేశారు. రాశి ముద్దుల్లో మాధుర్యం తెలిసే వయసు కాదు కదా ఆ బుడ్డోడిది? అందువల్లే బుంగమూతి పెట్టినట్టున్నాడు. అయినా... వాణ్ణి రాశి వదల్లేదు. కాసేపు ఆడుకున్నారు. తర్వాత బ్యాక్ టు షూట్! లండన్‌లోని ‘తొలిప్రేమ’ లొకేషన్లో సీన్ ఇది! వరుణ్‌తేజ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘తొలిప్రేమ’ చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. టైమ్ వేస్ట్ చేయకుండా వీలైతే రాత్రిపూట కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్... రాశీ ఖన్నా గరిటె తిప్పడం వంటివి. మరి.. ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో తిన్నోళ్లే చెప్పాలి!! -
చరణ్ కోసం చెమటోడుస్తోంది
ధృవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావటంతో, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ లవ్ స్టోరి చేస్తున్నట్టుగా ప్రకటించాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా రాశీఖన్నాను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాశీఖన్నాతో ఫోటో షూట్ కూడా చేసిన సుకుమార్, బరువు తగ్గితే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం కావటంతో ఎలాగైన సాధించాలని భావిస్తోంది రాశీ. అందుకే వీలైనంత త్వరగా బరువు తగ్గి, స్లిమ్ లుక్‌లోకి మారేందుకు జిమ్‌లో చెమటోడుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ధృవ రిలీజ్ తరువాత సుకుమార్, చరణ్‌ల కాంబినేషన్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
జోరుమీదున్న రాశిఖన్నా