Shahid Kapoor, Vijay Sethupathi Starrer FARZI Series Telugu Trailer Out - Sakshi
Sakshi News home page

Shahid Kapoor FARZI Trailer: షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి వెబ్‌ సిరీస్‌ ఫర్జీ ట్రైలర్‌ వచ్చేసింది

Published Sat, Jan 14 2023 9:06 PM | Last Updated on Sat, Jan 14 2023 9:20 PM

Shahid Kapoor, Vijay Sethupathi Starrer FARZI Series Telugu Trailer Out - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘ఫర్జీ’ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్‌ రాజ్‌-డీకేలు తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌లో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ఫిబ్రవరి 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 

చదవండి: అఫిషియల్‌: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్‌’ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ఈ నేపథ్యంలో సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఫర్జీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది అమెజాన్‌ ప్రైం వీడియోస్‌. ఈ ట్రైలర్‌ చూస్తుంటే డబ్బు చూట్టు కథ తిరుగనుందని తెలుస్తోంది. ‘నేను ఎంత డబ్బు సంపాదించాలంటే.. ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటూ షాహిద్‌ చెప్పే డైలాగ్‌ ఆసక్తిగా పెంచుతోంది. దొంగ నోట్లు ముద్రించే యువకుడిగా షాహిద్‌ ఇందులో కనిపంచనున్నాడు. ఇక ఫర్జీ ట్రైలర్‌ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మనీ హేస్ట్‌ ఇంగ్లీష్‌ సిరీస్‌ను తలపిస్తోంది.

చదవండి: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్‌ పోస్ట్‌

ఈ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా దర్శకులు రాజ్‌-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఎంతో అభిరుచితో ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించామని, ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో విజయ్‌ సేతుపతి పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు కేకే మేనన్‌, రాశీఖన్నాలు మరో కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement