‘థ్యాంక్‌ యూ’ నుంచి మెలోడీ సాంగ్‌, ఆకట్టుకుంటున్న లిరిక్స్‌ | Ento Entento Song Release From Naga Chaitanya Thank You Movie | Sakshi
Sakshi News home page

Thank You Movie: ‘థ్యాంక్‌ యూ’ నుంచి మెలోడీ సాంగ్‌, ఆకట్టుకుంటున్న లిరిక్స్‌

Published Thu, Jun 16 2022 6:19 PM | Last Updated on Thu, Jun 16 2022 6:21 PM

Ento Entento Song Release From Naga Chaitanya Thank You Movie - Sakshi

నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా చై విభిన్న లుక్‌లో అలరించనున్నాడు.  రాశీఖన్నా, మళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్‌ ఓ కీ రోల్‌ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడదులై టీజర్‌, పోస్టర్స్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక  జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఏంటో ఏంటేంటో అంటూ సాగే ఈ పాటను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగ చైతన్య, మాళవిక నాయర్‌ల మధ్య తెరకెక్కిన ఈ పాటకు ఆనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్‌ స్వరాలను సమకూర్చారు. కాగా శ్రీవెంకేటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement