
సినిమా స్టార్‌లు బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటే మైండ్ అండ్ బాడీ అంత ఫ్రెష్‌గా ఉండాలి. ఫీల్డ్ అలాంటిది. అందుకే కాజల్, రాశీఖన్నా, అదాశర్మ, సంజన.. తమ డైలీ లైఫ్‌లో యోగాకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు యోగా. ఆ తర్వాతే మిగతా షెడ్యూల్స్.
ఎక్కడికెళ్లినా యోగా మ్యాట్: కాజల్
చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే, ఐ హేట్ పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్. కానీ మార్చ్ ఫాస్ట్ అంటే ఇష్టంగా చేసేదాన్ని. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫిట్‌నెస్ మీద అవగాహన ఏర్పడింది. ఫస్ట్ నేను ఏరోబిక్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత జిమ్‌కు వెళ్లటం స్టార్ట్ చేశాను. ఓసారి యోగా ట్రై చేశాను. అంతే.. అప్పటినుండి యోగా నా జీవితంలో భాగమైపోయింది. బేసికల్లీ నేను ఫుడ్ లవర్‌ని. ఎంత ఇంట్రెస్ట్‌గా తింటానో ఫిట్‌నెస్ కోసం అంతే ఇష్టంగా వర్కవుట్ చేస్తాను. యోగా చేస్తే చాలు.. కేలరీలు ఇట్టే కరిగిపోతాయి.యోగా చేయడానికి ఎక్విప్‌మెంట్స్ ఏవీ అవసరంలేదు. అది అందరికీ తెలిసిందే. మనకు కావాల్సింది జస్ట్ ఒక్క యోగా మ్యాట్ మాత్రమే. నేను ఎక్కడికెళ్లినా నాతో పాటు యోగా మ్యాట్‌ని కంపల్సరీ తీసుకెళతాను. సో.. నో బ్రేక్ ఫర్ యోగా. వారానికి మూడు రోజులు రోజుకు గంటన్నర చొప్పున తప్పనిసరిగా యోగా చే స్తాను. వారంలో మరో మూడు రోజులు వెయిట్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తాను. సూర్య నమస్కారాలు బెస్ట్. నేను రోజూ ఏ ఆసనం వేసినా వేయకపోయినా సూర్య నమస్కారాలు మాత్రం మానను. 150 సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తాను. నా ఫిట్‌నెస్ సీక్రెట్స్‌లో యోగాకి ఫస్ట్ ప్లేస్.
టీనేజ్ నుంచే: రాశీ ఖన్నా
యోగా గొప్పదనం గురించి నా టీనేజ్‌లోనే నేను తెలుసుకున్నాను. నేను యోగా చేయడం మొదలుపెట్టినప్పుడు నా వయసు9 16. అప్పటినుంచి ఇప్పటివరకూ యోగా చేస్తున్నాను. యోగా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనసు, శరీరం రెంటికీ మంచిది. నిజానికి యోగా అంటే బరువు తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. అయితే అది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.సూర్య నమస్కారాలు నా ఫేవరెట్ ఆసనం. ఈ అసనంవల్ల శరీరంలో అన్ని కండరాల్లో కదలిక వస్తుంది.యోగా వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంత త్వరగా దేనికీ హర్ట్ అవ్వం.ఆ మధ్య నేను కొంత బరువు తగ్గాను. దానికి ముఖ్య కారణం యోగా. ఆ టైమ్‌లో వాకింగ్ కూడా బాగా చేశాన.నాది నైట్ టు ఫైవ్ జాబ్ కాదు. కొన్నిసార్లు రోజుకి 12, 13 గంటలు షూటింగ్ చేస్తుంటాను. అప్పుడు కూడా నాకు అలుపు అనిపించదు. దానికి ఒక కారణం యోగా. ఉదయం ఓ గంట సేను చేసే యోగా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
నా గురువు మా అమ్మగారే: అదాశర్మ
నాకు యోగాను పరిచయం చేసింది మా అమ్మగారే. నా చిన్నప్పుడు మా అమ్మగారు రోజూ యోగా చేయడం చూశాను. మెల్లిగా నాకూ అలవాటు చేశారు. నా యోగా గురువు మా అమ్మగారే.యోగాతో పాటు నేను వేరే ఎక్సర్‌సైజులు కూడా చేస్తాను. అయితే అవి చేసే ముందు యోగా చేస్తాను.నేను సూర్య నమస్కారాలు బాగా చేస్తాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించేది. అలవాటైన తర్వాత సూర నమస్కారాలు చేయని రోజున చాలా వెలితిగా ఉంటుంది.యోగాలో మెడిటేషన్ ఓ భాగం. ధాన్యం చేసి చూడండి. ఏకాగ్రత పెరుగుతుంది.నేను వెజిటేరియన్‌ని. అంతకు మించిన హెల్దీ ఫుడ్ లేదని నా ఒపీనియన్.ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా మైండ్ చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. దానికి కారణం యోగానే.ప్రతి రోజూ ఉదయం యోగా చేయడానికి ట్రై చేయండి. రోజంతా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
మనసు శరీరం బాగుంటాయి: సంజన
యోగా నా జీవితం. యోగా వల్లే నేను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. అంతా బాగున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. బాధలో ఉన్నప్పుడు కూడా నాకు సంతోషం ఇచ్చేది యోగానే.యోగా చేసేవారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే.. ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. మానసికంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిచేయటానికి ఎక్కువ ధైర్యం ఉంటుంది.నా జీవితంలో యోగా అన్నది ఓ పెద్ద పార్ట్. నాకు సొంత యోగా అకాడమీ (అక్షర్) ఉంది. బెంగళూర్‌లో మూడు యోగా అకాడమీలతో స్టార్ట్ చేసి, ఇప్పుడు మొత్తం 20 అకాడమీలు నిర్వహిస్తున్నాం. ప్రతి అకాడమీలో 500 నుంచి 600 మంది క్లైంట్స్ ఉన్నారు. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, ఇలా పాజిటివ్ కోర్స్‌లతో ఎంతోమందికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాం. మా ‘అక్షర్’ యోగాకి ఇప్పుటికి పదేళ్లు అయింది. యోగా అనేది నాకు డబ్బు సంపాదన కాదు. నా జీవితం నడవడానికి, డబ్బు సంపాదించటానికి సినిమాలు చేస్తాను కానీ, యోగా మాత్రం నా ఆత్మతృప్తి కోసం చేస్తా. మనవల్ల ఎంతో మంది బాగుండాలనే ఒక మంచి మనసుతో యోగా అకాడమీ పెట్టాను. యోగా పట్ల నాకు ఎంత ప్రేమ, భక్తి ఉన్నాయో నేను వేసే ఆసనాలను గమనిస్తే అర్థమవుతుంది. నేను చేసే అసనాలకు సంబంధించిన ఫొటోలు చూసి, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అయితే అలాంటి ఆసనాలు ట్రైనర్ లేకుండా ఇంట్లో ట్రై చేయకూడదు అనుభవం సంపాదించుకునేంతవరకూ ట్రైన్ సమక్షంలో చేయడమే బెటర్.యోగా చేస్తున్నవాళ్లు ఎప్పటికీ కంటిన్యూ చేయండి. చేయనివాళ్లు ఈరోజు నుంచి మొదలుపెట్టండి. మనసు, శరీరం రెండూ బాగుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment