
తమిళసినిమా: బహు భాషా నటిగా ఎదుగుతున్న నటి రాశీఖన్నా. ఈ హైదరాబాదీ బ్యూటీ గ్లామరస్ పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి పాత్రలతోనే గుర్తింపు పొందింది. తెలుగులో కొన్ని సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటించిన రాశీఖన్నా, తమిళంలో నటి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది.
ఆ తరువాత జయంరవి సరసన అడంగు మరు చిత్రం, అయోగ్య, అరణ్మణై 3, తిరుచిట్రం ఫలం, సర్ధార్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ పాన్ ఇండియా నటిగా ఎదుగుతోంది. కాగా ఇటీవల ఓ భేటీలో ప్రేమ కథా చిత్రాల గురించి స్పందిస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేది ప్రేమ కథా చిత్రాలేనని పేర్కొంది. ఆ తరహా చిత్రాలు ఎప్పటికీ బోర్ కొట్టవని చెప్పింది. తనకు వైవిధ్యభరిత చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉందని తెలిపింది. ఆషీకీ వంటి మనసును హత్తుకునే ప్రేమ కథా చిత్రం చేయాలన్నది తన చిరకాల వాంఛ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment