మీకు తెలుసా.. ఈ గిటార్ మడతపెట్టుకోవచ్చు | foldable Ascender P90 Solo guitar price and details | Sakshi
Sakshi News home page

రూ.1.32 లక్షల గిటార్.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

Published Sun, Jun 4 2023 3:12 PM | Last Updated on Fri, Jun 23 2023 6:03 PM

foldable Ascender P90 Solo guitar price and details - Sakshi

గిటార్‌ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్‌ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్ది మంది ఉంటే, కాలక్షేపంగా గిటార్‌ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్‌ను జాగ్రత్తగా బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. 

లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్‌ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్‌ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్‌’ సులువుగా మడిచేసుకునే గిటార్‌ను ‘ఎసెండర్‌ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్‌ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement