ఫిజియోథెరపీ, సెల్ థెరపీ, హార్మోన్ థెరపీ... ఇలా రకరకాల థెరపీలు విన్నాం కానీ.. ఈ గిటార్ థెరపీ ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఇది పూజా హెగ్డే కనిపెట్టిన కొత్త థెరపీ. విషయం ఏంటంటే... ఈ బ్యూటీకి ఈ మధ్య గిటార్ నేర్చుకోవాలనిపించిందట. అనిపించాలే కానీ, నేర్చుకోవడం ఎంతసేపు. ఓ గిటార్ కొనుక్కున్నారు. తనతో పాటే షూటింగ్ లొకేషన్‌కి తీసుకెళుతున్నారు.
షాట్ గ్యాప్‌లో గిటార్ నేర్చుకుంటున్నారు. ‘‘మ్యూజిక్ ఈజ్ నాట్ మ్యూజిక్.. ఇట్స్ ఎ థెరపీ’’ అని కూడా అన్నారు. కరెక్టే.. సంగీతం మనసుకు స్వాంతన చేకూర్చుతుంది. మైండ్‌ని రిలాక్స్ చేస్తుంది. అందుకే పూజా హెగ్డే ‘గిటార్ థెరపీ’ అని అన్నారు. తాను ప్లే చేస్తున్న మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె.
‘‘మీరు ట్రై చేస్తున్న మ్యూజిక్ వినడానికి బాగుంది. మ్యూజిక్ మీ లైఫ్‌ని మోర్ బ్యూటిఫుల్‌గా ఛేంజ్ చేస్తుంది. త్వరలోనే గిటార్‌ను ఫుల్‌గా ప్లే చేస్తావని ఆశిస్తున్నాను’’ అని దేవీశ్రీ ప్రసాద్ రెస్పాండ్ అయ్యారు. ‘‘నేను గిటారు నేర్చుకోవాలని ట్రై చేస్తున్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల పట్ల గౌరవం మరింత పెరిగింది. చాలెంజింగ్‌గా స్టార్ట్ చేశాను. గిటారు నేర్చుకోవడం చాలా ఫన్‌గా ఉంది’’ అని ఆమె బుదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment