ఓ వ్యక్తి గిటారు వాయించడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆయన గిటార్ వాయించడంలో దిట్ట కాదు, లేదా మైమరిపించే సంగీతాన్ని అందించి రికార్డులు సృష్టించిన వ్యక్తి కాదు. మరి ఎందుకు అంత వైరల్ అయిందనే కదా మీ డౌటనుమానం? ఆయన సంగీత విద్యలో వైవిధ్యం లేదు కానీ.. ఆయన వాయించే గిటారు పరికరంలో మాత్రం ఉంది. ఆ గిటారు చెక్కతోనో, తేలికైన లోహాలతోనో తయారు చేసిందో కాదు..మనిషి అస్థిపంజరంతో తయారు చేసింది. ఏంటి షాకవుతున్నారా? నిజమండి బాబు.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటారు తయారు చేసి.. దానితో మ్యూజిక్ వాయిస్తున్నాడు నార్వేకు చెందిన ప్రిన్స్ మిడ్‌నైట్ అనే యువకుడు.
తన అంకుల్ మరణించాక తన అస్థిపంజరంలోని చాతి నుంచి నడుము భాగం వరకు ఉండే ఎముకల గూడును ఉపయోగించి ఆరు ఎలక్ట్రిక్ స్ట్రింగ్స్ గల గిటారు తయారు చేశాడు. దాన్ని లయబద్ధంగా వాయిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తన అంకుల్ ఫిలిప్ గౌరవార్థం ఈ గిటారు తయారు చేశానని తెలిపాడు.
‘కొన్నేళ్ల కిందట మా అంకుల్ ఫిలిప్ చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపకుండా.. భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్‌కు దానమిచ్చారు. ఇటీవల మెడికల్ కాలేజ్ ఆయన అస్థిపంజరాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని మా అంకుల్ కుటుంబానికి తెలియజేశారు. కానీ వారి తిరస్కరించారు. దీంతో ఆ అస్థిపంజరాన్ని నేను తీసుకొని గిటారు తయారు చేశాను. నా నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. ప్రస్తుతం ఈ గిటారు చక్కగా పని చేస్తుంది’అని ప్రిన్స్ మిడ్‌నైట్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment