సర్జరీ సమయంలో గిటార్ వాయిస్తున్న టస్కిన్ ఇబ్నా అలీ
బెంగళూరు : నగరానికి చెందిన భగవాన్ మహవీర్ జైన్ ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటున్న పేషెంట్‌తో సర్జరీ మధ్యలో గిటార్ ప్లే చేయించారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను కూడా వినియోగించమని పేషెంట్‌కు సూచించడంతో అతను అలవోకగా ఫోన్‌ను వినియోగించాడు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మ్యూజిషియన్, ఇంజినీర్ టస్కిన్ ఇబ్నా అలీ(31) న్యూరలాజికల్ సమస్య(వేళ్లు పని చేయడం మానేశాయి)తో మహవీర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్జరీ నిర్వహిస్తూ చేతి వేళ్ల ఎలా పని చేస్తున్నాయో పరీక్షించేందుకు అలీతో గిటార్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగింపజేశారు.
సర్జరీపై మీడియాతో మాట్లాడిన న్యూరాలిజిస్టు డా. సంజీవ్.. గిటారిస్టుల్లో ఎక్కువగా వేళ్ల కదలికల సమస్య తలెత్తుతుంటుందని చెప్పారు. ఉద్యోగ రీత్యా ఇంజినీర్ అయిన అలీకి గిటారప్లే చేయడం అంటే ఇష్టమని చెప్పారు. ఇలాంటి సమస్యలకు వైద్యం చేయడం కన్నా, సర్జరీయే మేలని తెలిపారు. సర్జరీ విజయవంతమైందని అలీ వేళ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment