కొత్త ప్రయోగం | maya movie Promotional images Launched | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయోగం

Jun 16 2014 12:10 AM | Updated on Sep 2 2017 8:51 AM

కొత్త ప్రయోగం

కొత్త ప్రయోగం

నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ

 నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. వీరితో పాటు మల్టీడైమన్షన్ వాసు, కళామందిర్ కల్యాణ్ అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా, తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. భిన్నమైన కథనంతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది’’ అని నీలకంఠ చెప్పారు. ఈ నెల 22న పాటల్ని, జూలై 4న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement