Neelkanth
-
అధికారిక డేటాకు మించిన వృద్ధి ఉంటుంది
ముంబై: అధికారిక డేటాలో కనిపిస్తున్న దానికి మించి భారత్ వృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఈక్విటీల అంచనాలను ’అండర్‌వెయిట్’ నుంచి ’బెంచ్‌మార్క్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. కీలక సూచీలు 14 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సంస్థ రీసెర్చ్ హెడ్ నీలకంఠ్ మిశ్రా తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6 శాతం దిగువకు తగ్గొచ్చని అంతా అంచనా వేస్తున్నప్పటికీ ఇది 7 శాతం స్థాయిలో ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా అంతా కేవలం అధికారిక డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము మరింత విస్తృత గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ‘దేశీయంగా మరిన్ని వృద్ధి చోదకాల ఊతంతో 2023లో భారత్ జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని పెంచడం, అల్పాదాయ ఉద్యోగాలు పెరగడం, సరఫరావ్యవస్థపరమైన అవాంతరాలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవు. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఎకానమీ మందగమనం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా నిలువరించగలవు‘ అని మిశ్రా చెప్పారు. రిస్కులు ఉన్నాయి.. ఇంధనాల దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం, ప్రపంచ ఎకానమీ మందగించడం వంటి అంశాల ఆధారిత రిస్కులు కొనసాగుతాయని మిశ్రా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మరింతగా వడ్డీ రేట్లను పెంచాల్సినంతగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఇతరత్రా పరిస్థితులు లేవని తెలిపారు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆర్బీఐ .. రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు, చైనా కష్టాల్లో ఉండటం వల్లే భారత్‌లోకి మరిన్ని నిధులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని మిశ్రా చెప్పారు. ప్రాంతాలను బట్టి ఆసియా పసిఫిక్, వర్ధమాన మార్కెట్లు వంటి వాటికి మేనేజర్లు పెట్టుబడులు కేటాయిస్తూ ఉంటారని, దానికి అనుగుణంగానే భారత్‌లోకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఆశావహంగా కనిపిస్తోందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని మిశ్రా వివరించారు. -
గండికోట ఇదేరా..
ప్రముఖ సినీ డెరైక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం గండికోటపై థీం సాంగ్ చిత్రీకరించారు. గండికోట అందాలను దేశ నలుమూలలా చాటడానికి రాష్ట్ర పర్యాటక శాఖ తొలి యత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు పట్టణంలోని ఈడిగ పేటకు చెందిన 30 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో హీరో రోహిత్, హీరోహిన్ శ ృతియుగల్తో ‘ఇదేరా.. గండికోట ఇదేరా..’ అంటూ పాటను చిత్రీకరించారు. గండికోట చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర డ్రోన్లకు అమర్చిన కెమెరాలలో ప్రకృతి అందాలను బంధించారు. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ గండికోటలోని జుమ్మామసీద్, మాదవరాయస్వామి ఆలయం, పెన్నా నది లోయ, తదితర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ద ృష్టి సారిస్తే ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. - జమ్మలమడుగు రూరల్ -
‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు రావాలి
‘‘నీలకంఠ సినిమాలు కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కథాంశం కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు ఈ చిత్రం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమా ఆడియోలకు అండగా నిలబడుతున్న ‘మధుర’ సంస్థ అధినేత శ్రీధర్ అంటే నాకు అభిమానం’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై డా. ఏమ్వీకే రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘మాయ’. శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో ‘అల్లరి’ నరేశ్ ఆవిష్కరించి, మల్టీ డైమన్షన్ సంస్థకు చెందిన వాసుకు ఇచ్చారు. మరో అతిథి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘నీలకంఠలానే ఆయన సినిమాలు కొద్దిగా స్లోగా ఉంటాయి. కానీ, ఈ చిత్రం ట్రైలర్ స్పీడ్‌గా ఉంది కాబట్టి, ట్రెండ్ మార్చాడనిపిస్తోంది. ఎప్పుడూ కొత్త కథలతోనే ఆయన సినిమాలు చేస్తాడు’’ అన్నారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నేను ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తీసిన తర్వాత, మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకుంటున్న తరుణంలో నీలకంఠ ‘మాయ’ కథ చెప్పారు. నా బలం, నీలకంఠ దర్శకత్వం తోడైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇదని, ఇది కొత్త తరహా సినిమా అని, అనుకున్నట్లుగా సినిమా బాగా రావడానికి చిత్రబృందం అందించిన సహకారమేనని చెప్పారు నీలకంఠ. ఇంకా ఈ వేడుకలో లగడపాటి శ్రీధర్, బెక్కం వేణుగోపాల్, సిరాశ్రీ, సందీప్ కిషన్, రఘు కుంచె, శేఖర్‌చంద్ర, హర్షవర్ధన్ రాణె, అవంతిక తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ప్రయోగం
నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. వీరితో పాటు మల్టీడైమన్షన్ వాసు, కళామందిర్ కల్యాణ్ అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా, తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. భిన్నమైన కథనంతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది’’ అని నీలకంఠ చెప్పారు. ఈ నెల 22న పాటల్ని, జూలై 4న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి.