Madhura Sridhar
-
2020 శివది కావాలని కోరుకుంటున్నా
‘‘ఒక చిన్న సినిమా విడుదలకి ముందే అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకోవడం నిజంగా అదృష్టం. శివ పరిచయం కాబోతున్న సినిమా అంటే మా అందరికీ సెలబ్రేషన్ మూమెంట్’’ అన్నారు దర్శక–నిర్మాత మధుర శ్రీధర్. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక కథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలైన పాటలకు 25 మిలియన్ల వ్యూస్ రావడంతో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రబృందం. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకుడు, రచయితలందరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అయి 2020 మా శివదే కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘సినిమా మొదలయినప్పటి నుంచి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. నా సినిమాలో పాటలన్నీ బావుండాలని పెద్ద రచయితలతోనే రాయించుకున్నాం. శివ బాగా యాక్ట్ చేశాడు’’ అన్నారు శేష సింధు. ‘‘మంచి స్క్రిప్ట్‌తో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న మా నాన్నగారికి, మా డైరెక్టర్ సింధుగారికి ధన్యవాదాలు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘సున్నితమైన భావోద్వేగాలతో శేష సింధుగారు బాగా చిత్రీకరించారు. సినిమాకు మంచి సంగీతం కుదిరింది’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. -
అన్న దొరకడంలేదు.. తమ్ముడు కావాలన్నారు
‘‘మా అన్న (విజయ్ దేవరకొండ) చాలా ఇబ్బందులు చూశాడు. కానీ, తనకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చనే నమ్మకం కలిగింది’’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. డి.సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► అన్న చేసిన ‘అర్జున్ రెడ్డి’ తర్వాత కొంతమంది మా నాన్నకి ఫోన్ చేసి, మీ పెదబాబు డేట్స్ దొరకడం లేదు.. చినబాబు దొరుకుతాడా? అని అడిగారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. వారి మాటలను అప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. అన్నయ్య వ్యాపారాలను సపోర్ట్ చేద్దామని ఉద్యోగం వదిలి ఇండియాకి వచ్చాను. ► నేను అమెరికాకు వెళ్లక ముందు థియేటర్స్ చేశాను. నటనలో అనుభవం ఉంది కానీ కెమెరా ముందు లేదు. ఆ టైమ్‌లో మహేంద్రను కలిశాక నటనపై ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ‘దొరసాని’ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ► 1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. రాజు, దొరసాని మధ్య జరిగిన ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయతీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ► విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఉన్నాడని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దామనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేశాం. ఆ పాత్రలకు సరిపోతాం అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మమ్మల్ని తీసుకున్నారు. ► ఇందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ధనవంతురాలైన దొరసానిని ప్రేమించిన పేదవాడైన రాజు చాలా సహజంగా అనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్, యాంగర్, లిప్‌లాక్‌లు లాంటివి ఏమీ ఉండవు. ► అన్నకు, నాకు సినిమాలంటే చాలా పిచ్చి. నాన్న టీవీ షోలు, సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు. స్కూల్ డేస్ నుంచే అన్న స్టోరీలు రాసేవాడు. తను యాక్టర్ కాకపోతే డైరెక్టర్ అయ్యే వాడేమో బహుశా! ► ‘దొరసాని’ కథను ఓకే చేశాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి మా బాధ్యతను మరింత పెంచారు. ► నా తర్వాతి సినిమా కోసం రెండు కథలు విన్నాను. వాటిల్లో వినోద్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం. నాకు ఏదైనా పాత్ర కరెక్టుగా సరిపోతుందని అన్నయ్యకి అనిపించి, నన్ను చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేస్తా. -
నవ్వించి, ఏడిపించే ఆత్రేయ
నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా స్వరూప్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ–‘‘ఈ టైటిల్ ఆసక్తిగా ఉంది. నవీన్ మంచి నటుడు. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి నవీన్‌తో పరిచయం ఉంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, థ్రిల్లర్ అంశాలు కనిపిస్తున్నాయి’’ అన్నారు నాగ్ అశ్విన్. ‘‘ఏజెంట్ అనే పదం పక్కన ఇంగ్లీష్ పేర్లతో ఉన్న టైటిల్స్ చాలా ఉన్నాయి. అందుకే ఏజెంట్ పక్కన స్వచ్ఛమైన తెలుగు పేరు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ టైటిల్ పెట్టాం. మొదట్లో నిర్మాత రాహుల్‌గారు కన్విన్స్ అవలేదు. టైటిల్ డిజైన్ చేశాక ఓకే అన్నారు. ఆత్రేయ, ప్రేక్షకుల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, థ్రిల్ చేస్తాడు’’ అని స్వరూప్ రాజ్ అన్నారు. ‘‘నవీన్ లాంటి నటుణ్ణి, స్వరూప్ లాంటి డైరెక్టర్ని పరిచయం చేస్తుండటం హ్యాపీ. మా సినిమా అందర్నీ ఆలోచింప చేస్తుంది’’ అన్నారు రాహుల్ యాదవ్ నక్కా. ‘‘షార్ట్ ఫిలిమ్స్‌తో నటించిన నేను ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నా. ఈనెల 21న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కృపాటి. -
వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన సంగతులు. ► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్‌చరణ్ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్ తేజ్ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్‌ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్ బాగా తీశారు. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో అవి లైఫ్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ. ► నాకు, భరత్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడిపాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్ షో అయితే టికెట్ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను. ► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌గారిని కలిశాను. డీసెంట్ యాక్టర్‌కి, గుడ్ యాక్టర్ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్ యాక్టర్’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్లైన్ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ. -
సిడ్కి పెద్ద ఫ్యాన్‌ని – అల్లు శిరీష్
‘‘ఏబీసీడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బెంగళూర్ వెళ్లినప్పుడు రేడియోలో ఓ పాట విని జుడా శాండీ అయితే బావుంటుంది అనుకున్నాను. ఈ సినిమాతో తనని తెలుగుకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏబీసీడి’. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ సినిమాలోని తొలి పాటను బుధవారం రిలీజ్ చేశారు. నిహారిక కొణిదెల బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘జుడా శాండీగారికి మా సినిమా ద్వారా తెలుగుకు ఆహ్వానం పలుకుతున్నాం. సిడ్ శ్రీరామ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకీ అవకాశం ఇచ్చిన శిరీష్‌గారికి రుణపడి ఉంటా. యష్ రంగినేనిగారికి, ధీరజ్ మొగిలినేనిగారికి థ్యాంక్స్. మంచి సంగీత దర్శకుడిగా శాండీ పేరు తెచ్చుకుంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సిడ్ శ్రీరామ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నా సినిమాకు పాడటం గౌరవంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నా. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శిరీష్. భరత్, రుక్సార్ థిల్లాన్, ఎస్కేయన్ పాల్గొన్నారు. -
కొంత లాభం ఊరి కోసం!
పంపిణీరంగంలో ఉన్నవారు నిర్మాతలుగానూ మారుతుంటారు. ఉదాహరణకు ‘దిల్’ రాజు ఒకరు. ఇప్పుడు పంపిణీ రంగం నుంచి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మాతలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఈ ఇద్దరూ ఓ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బ్యానర్ లోగోను నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, అశోక్ రెడ్డిలతో పాటు ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. ఈ బ్యానర్లో చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుందన్న విషయాన్ని ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ‘ఈ మాయ పేరేమిటో’ హీరో రాహుల్ విజయ్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘సురేశ్, అహితేజలు బ్యానర్ పెడుతున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యా. వీళ్లు పెద్ద ప్రొడ్యూసర్స్ కావాలి. ఈ బ్యానర్లో మంచి మంచి సినిమాలు రావాలి’’అన్నారు. ‘‘టీజర్, ట్రైలర్ చూడగానే సురేశ్, అహితేజలు ఆ సినిమా స్కేల్‌ను అంచనా వేయగలరు. వీళ్లకు ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ లైఫ్ ఉండాలి’’అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వీరిద్దరిలో ఒకరు బాధ్యతను గుర్తు చేస్తే, మరొకరు ధైర్యాన్ని ఇస్తారు. ఇటువంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం అన్నారు’’ చిన్నికృష్ణ. ‘‘వీళ్లు తప్పకుండా సక్సెస్ కావాలి’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడి వరకు రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సురేశ్ వర్మ. ‘‘నాకు సినిమా అంటే చిరంజీవిగారే. ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రవీణ్‌ను మిస్ అవుతున్నాను. మా మొదటి సినిమా నుంచే మాకు వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగు కోసం ఖర్చుపెడతాం’’ అన్నారు అహితేజ. -
మన్మథ రేఖ నా ఆలోచనే!
‘‘బాహుబలి’ మినహా ఇటీవల తెలుగులో పెద్దగా సీక్వెల్స్ రాలేదు. ఏదైనా సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందనిపించింది. పైగా, నాకు ఎప్పటి నుంచో గ్రామీణ నేపథ్యంలో ఓ చిత్రంతో పాటు, వంశీగారితో ఓ సినిమా చేయాలని ఉండేది. ఆ రెండూ ‘ఫ్యాషన్ డిజైనర్’తో సెట్ అయ్యాయి’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ‘స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ’ తదితర చిత్రాల ద్వారా అభిరుచి ఉన్న దర్శకుడిగా, ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనసు’ వంటి వైవిధ్యమైన చిత్రాల ద్వారా మంచి నిర్మాతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’కు సీక్వెల్‌గా ఆయన నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో. అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస హీరోయిన్లు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘ఫ్యాషన్ డిజైనర్’కు, ‘లేడీస్ టైలర్’కు సంబంధం లేదు. ఫ్యాషన్ డిజైనర్ డిఫరెంట్ కాన్సెప్ట్. సుందరం కొడుకు గోపాలం ఇప్పుడేం చేస్తుంటాడు? అన్నదే కథ. ఇది రాజేంద్రప్రసాద్‌గారు చేసిన రోల్, వంశీగారు డైరెక్ట్ చేస్తున్నారని సుమంత్ జాగ్రత్తగా చేశాడు. తన నటనకు నేను సంతృప్తి చెందా. వంశీగారిని లోతుగా అర్థం చేసుకుంటే ప్రయాణం హ్యాపీ, సరదాగా పని చేయొచ్చు. ‘ఫ్యాషన్ డిజైనర్’లో హీరోకి మన్మథ రేఖ ఉంటుంది. మన్మథ రేఖ ఉండటం అనే ఆలోచనే నాదే. ఆ రేఖ ఉన్నవాళ్లు అమ్మాయిలతో కాసేపు మాట్లాడితే ఇంప్రెస్ అయిపోతారు. సిటీకొచ్చి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఆశ హీరోకి ఉంటుంది. మణిశర్మ సంగీతం, రీ–రికార్డింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు. -
ఫ్యాషన్ డిజైనర్‌పై మంచు లక్ష్మీ ఫైర్
సీనియర్ దర్శకుడు వంశీ, లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్గా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఓ డిజైనర్., అమ్మాయి కొలతలు తీసుకుంటున్నట్టుగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత మధుర శ్రీధర్, 'వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ప్రీ లుక్ ఇదే.. ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే రిలీజ్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రీ లుక్‌పై స్పందించిన మంచు లక్ష్మీ ' మనం అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తాం' అంటూ కామెంట్ చేసింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచు లక్ష్మీకి మద్ధతు తెలిపింది. వెంటనే స్పందించిన మధుర శ్రీధర్ మంచు లక్ష్మీకి సమాధానం ఇచ్చాడు. 'మేము ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టర్‌ను రిలీజ్ చేయలేదు. సినిమాలోని ఒక సన్నివేశం నుంచి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాం.' అంటూ ట్వీట్ చేశారు. అయితే మంచు లక్ష్మీ ట్వీట్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జుమ్మందినాథం, గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో తాప్సీని బొల్డ్‌గా చూపించినప్పుడు స్పందించని లక్ష్మీ, ఇప్పుడు ఈ పోస్టర్‌ను తప్పు పడ్డటం ఏంటీ..? అన్న వాదన వినిపిస్తోంది. Dear Friends! Here is the Pre-Look of Vamsy's FASHION DESIGNER s/o LADIES TAILOR. Thank you! First Look very soon!!! #FashionDesigner pic.twitter.com/ny4bXiXYCA — Madhura Sreedhar (@madhurasreedhar) 31 March 2017 When will we stop objectifying women like this. :( https://t.co/G986saczvu — Lakshmi Manchu (@LakshmiManchu) 1 April 2017 -
కష్టానికి తగ్గ ప్రతిఫలం
‘‘ ‘స్నేహగీతం’ తరువాత ఈ చిత్రం ద్వారా మంచి విజయం దక్కింది. నెగటివ్ క్లైమాక్స్ అయినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ హిట్‌తో మరో ఐదేళ్లు ఆక్సిజన్ తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ‘మధుర’ శ్రీధర్, ఎంవీకే రెడ్డి నిర్మించిన ‘లేడీస్ అండ్ జంటిల్మేన్’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ -‘‘తెలుగులో ఎప్పుడూ రాని కాన్సెప్ట్‌తో తీశాం. ఈ సినిమా విజయం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్, రఘు కుంచె, కమల్ కామరాజ్, చైతన్యకృష్ణ, రాజ్ కందుకూరి, హర్ష, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
''మాయ'' టీమ్‌తో చిట్‌చాట్
-
కొత్త ప్రయోగం
నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. వీరితో పాటు మల్టీడైమన్షన్ వాసు, కళామందిర్ కల్యాణ్ అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా, తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. భిన్నమైన కథనంతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది’’ అని నీలకంఠ చెప్పారు. ఈ నెల 22న పాటల్ని, జూలై 4న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి.