
‘‘ఏబీసీడి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బెంగళూర్ వెళ్లినప్పుడు రేడియోలో ఓ పాట విని జుడా శాండీ అయితే బావుంటుంది అనుకున్నాను. ఈ సినిమాతో తనని తెలుగుకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏబీసీడి’. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ సినిమాలోని తొలి పాటను బుధవారం రిలీజ్ చేశారు.
నిహారిక కొణిదెల బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘జుడా శాండీగారికి మా సినిమా ద్వారా తెలుగుకు ఆహ్వానం పలుకుతున్నాం. సిడ్ శ్రీరామ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకీ అవకాశం ఇచ్చిన శిరీష్‌గారికి రుణపడి ఉంటా. యష్ రంగినేనిగారికి, ధీరజ్ మొగిలినేనిగారికి థ్యాంక్స్. మంచి సంగీత దర్శకుడిగా శాండీ పేరు తెచ్చుకుంటారు’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సిడ్ శ్రీరామ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నా సినిమాకు పాడటం గౌరవంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నా. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శిరీష్. భరత్, రుక్సార్ థిల్లాన్, ఎస్‌కేయన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment