![కష్టానికి తగ్గ ప్రతిఫలం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41423159443_625x300.jpg.webp?itok=tjSG5z__)
కష్టానికి తగ్గ ప్రతిఫలం
‘‘ ‘స్నేహగీతం’ తరువాత ఈ చిత్రం ద్వారా మంచి విజయం దక్కింది. నెగటివ్ క్లైమాక్స్ అయినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ హిట్‌తో మరో ఐదేళ్లు ఆక్సిజన్ తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ‘మధుర’ శ్రీధర్, ఎంవీకే రెడ్డి నిర్మించిన ‘లేడీస్ అండ్ జంటిల్‌మేన్’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ -‘‘తెలుగులో ఎప్పుడూ రాని కాన్సెప్ట్‌తో తీశాం.
ఈ సినిమా విజయం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్, రఘు కుంచె, కమల్ కామరాజ్, చైతన్యకృష్ణ, రాజ్ కందుకూరి, హర్ష, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.