Ladies and Gentlemen
-
హీరోయిన్ నిఖితా నారాయణ్‌తో చిట్‌చాట్
-
కష్టానికి తగ్గ ప్రతిఫలం
‘‘ ‘స్నేహగీతం’ తరువాత ఈ చిత్రం ద్వారా మంచి విజయం దక్కింది. నెగటివ్ క్లైమాక్స్ అయినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ హిట్‌తో మరో ఐదేళ్లు ఆక్సిజన్ తీసుకున్నంత ఆనందంగా ఉంది’’ అని ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ‘మధుర’ శ్రీధర్, ఎంవీకే రెడ్డి నిర్మించిన ‘లేడీస్ అండ్ జంటిల్మేన్’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ -‘‘తెలుగులో ఎప్పుడూ రాని కాన్సెప్ట్‌తో తీశాం. ఈ సినిమా విజయం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్, రఘు కుంచె, కమల్ కామరాజ్, చైతన్యకృష్ణ, రాజ్ కందుకూరి, హర్ష, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
'లేడీస్ అండ్ జెంటిల్మెన్' ఫేం స్వాతితో చిట్‌చాట్
-
సైబర్ సినిమా
-
చూశారు... మెచ్చారు...
‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ మొబైల్ ద్వారా విడుదల చేశారు. ఓ ప్రత్యేక ప్రదర్శనలో సినిమాను చూసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘సైబర్ క్రైమ్ ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇది లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి’’ అని ఆకాంక్షించారు. పి. మంజునాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ 30న విడుదల కానుంది. గతంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘మాయ’ చిత్రాన్ని మహేశ్‌భట్ ‘మర్డర్-4’గా హిందీలోకి రీమేక్ చే స్తున్నారు. -
అర్థవంతమైన కథ... కథనాలతో...
కమల్కామరాజ్, మహత్, అడివి శేష్, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. పి.బి.మంజునాథ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ... ఎంవీకే రెడ్డితో కలిసి మధురా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుంచె రఘు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను లగడపాటి శ్రీధర్, సందీప్‌కిషన్, పంపిణీదారుడు అంజిరెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన మంచు మనోజ్, మధుశాలిని, హాయ్ రబ్బా స్మిత తదితరులందరూ పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. అర్థవంతమైన కథా, కథనాలతో సాగే సినిమా ఇదనీ, ఈ చిత్ర కథా రచయిత సంజీవ్‌రెడ్డిని ‘ఓం మంగళం మంగళం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేయబోతున్నాననీ మధురా శ్రీధర్ చెప్పారు. మల్టీస్టారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యువతరాన్ని ఆకట్టుకునే అంశాలెన్నో ఉంటాయనీ దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర బృందం మాట్లాడారు. -
జెంటిల్ మెన్... ఈ లేడీని చూడండి!
-
సైబర్ నేరాల ప్రభావం
‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఆశయంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. మంజునాధ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడనే నమ్మకంతో ఈ చిత్రానికి అవకాశం ఇచ్చాను. యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది’’ అని మధుర శ్రీధర్ చెప్పారు. గోతెలుగు.కామ్ సమర్పణలో పీఎల్ క్రియేషన్స్, షిర్టిసాయి కంబైన్స్‌పై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’. పీబీ మంజునాధ్ దర్శకుడు. చైతన్యకృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర, నిఖితా నారాయణ్, స్వాతీ దీక్షిత్, జాస్మిన్ ముఖ్య తారలు. చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న లగడపాటి శ్రీధర్, మల్టీ డైమన్షన్ వాసు, నీలకంఠ తదితరులు ప్రచార గీతం బాగుందని, సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. బుర్రకథ నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ గురించి తెలిపే పాట ఇదని రఘు కుంచె చెప్పారు. మానవ సంబంధాలకంటే సోషల్ మీడియాకే నేటి తరం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సైబర్ నేరాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే కథాంశాన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించామని దర్శకుడు చెప్పారు. -
ఇంటర్నెట్ నేపథ్యంలో....
‘‘దర్శకునిగా కొనసాగుతూ, నిర్మాతగా కొన్ని సినిమాలు తీయాలనుకుని చాలా కథలు విన్నాను. నా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసే ముంజునాథ్ చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా తన దర్శకత్వంలో ఈ సినిమా చేశాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. చైతన్యకృష్ణ, అడివి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, నిఖితా నారాయణ్, జాస్మిన్, స్వాతి దీక్షిత్ ముఖ్య తారలుగా పి.బి. మంజునాథ్ దర్శకత్వంలో ఎమ్.వి.కె.రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడూ అంతే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. కథ నచ్చి ఈ సినిమాలో భాగస్వామిగా చేరానని రాజ్ కందుకూరి చెప్పారు. ఇందులో తమవి చాలా మంచి పాత్రలని చెతన్యకృష్ణ, అడివి శేష్, కమల్ కామరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వర్మ, కల్యాణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
లేడీస్ & జంటిల్ మెన్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
-
లేడిస్ & జంటిల్మెన్ షూటింగ్