అర్థవంతమైన కథ... కథనాలతో... | ladies and gentlemen movie audio released | Sakshi
Sakshi News home page

అర్థవంతమైన కథ... కథనాలతో...

Published Sun, Dec 7 2014 10:41 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

అర్థవంతమైన కథ... కథనాలతో... - Sakshi

అర్థవంతమైన కథ... కథనాలతో...

కమల్‌కామరాజ్, మహత్, అడివి శేష్, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. పి.బి.మంజునాథ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ... ఎంవీకే రెడ్డితో కలిసి మధురా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుంచె రఘు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను లగడపాటి శ్రీధర్, సందీప్‌కిషన్, పంపిణీదారుడు అంజిరెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన మంచు మనోజ్, మధుశాలిని, హాయ్ రబ్బా స్మిత తదితరులందరూ పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. అర్థవంతమైన కథా, కథనాలతో సాగే సినిమా ఇదనీ, ఈ చిత్ర కథా రచయిత సంజీవ్‌రెడ్డిని ‘ఓం మంగళం మంగళం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేయబోతున్నాననీ మధురా శ్రీధర్ చెప్పారు. మల్టీస్టారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యువతరాన్ని ఆకట్టుకునే అంశాలెన్నో ఉంటాయనీ దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర బృందం మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement