Kamal Kamaraj
-
డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్
కొత్త డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండ తీసిన సినిమా 'సోదర సోదరీమణులారా'. కమల్ కామరాజు, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే టైటిల్‌తో తీసిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్.. ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచుతుంది. టైటిల్, పోస్టర్‌తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందనే ఫీలింగ్ కలుగుతుంది. వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రాఫర్ కాగా పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. (ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ) -
కమల్ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్‌లుక్ అవుట్
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్. ఈ సినిమాతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్‌తో కేవలం 35రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
లవ్ అండ్ వార్
కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘లా’ (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్క దర్శకత్వంలో రమేష్ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్ గోపాల్. ‘‘లా’తో హీరోగా నేను రీ లాంచ్ అంటున్నారు. అవేమీ పెద్దగా నమ్మను. ఈ సినిమాకి మొదటి హీరో స్క్రీన్‌ప్లే. ‘లా’ని ఫాలో చేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ని ఫాలో అయినట్లే’’ అని కమల్ కామరాజ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సంగీతం: సత్య కశ్యప్, సహ నిర్మాత: మద్దిపాటి శివ. -
లవ్ అండ్ వార్
సమాజంలో ప్రతి మనిషి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించకుంటే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లా’. ‘లవ్ అండ్ వార్’ అనేది ఉపశీర్షిక. కమల్ కామరాజ్, మౌర్యాణి జంటగా గగన్ గోపాల్ దర్శకత్వంలో రమేశ్‌బాబు మున్నా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ –‘‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ, గగన్ గోపాల్ చాలా డీటైల్డ్‌గా కథ చెప్పాడు. ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. సినిమా కథనం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఈ సినిమాను ఎక్కువ భాగం విజయవాడలో తీశాం’’ అన్నారు. ‘‘మంచి ట్వస్ట్లతో, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనాలతో ‘లా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సత్య కశ్యప్ మ్యూజిక్ సినిమాకి ప్రధానం బలం’’ అన్నారు గగన్ గోపాల్ ముల్క. నిర్మాతలు, మౌర్యాణి పాల్గొన్నారు. పూజా రామచంద్రన్, మంజు భార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సహనిర్మాత: మద్దిపాటి శివ. -
యూత్ కోసం రియాలిటీ షో
‘ఫస్ట్ టైమ్ మన యూత్ కోసం తెలుగులో ఒక రియాలిటీ షో వచ్చిందిరా’ అంటూ ప్రారంభమయ్యే ‘తరువాత ఎవరు’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కమల్ కామరాజు, భరణి, మనోజ్, ప్రియాంక శర్మ, యషికా మౌల్కర్, సాయి కిరణ్ ముఖ్య తారలుగా జి.కృష్ణప్రసాద్, కె.రాజేష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మిరెడ్డి కె., రాజేష్ కోడూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ– ‘‘తరువాత ఎవరు’ టైటిల్లోనే సినిమా కథ మొత్తం ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ చాలా గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని అంటున్నారు. అదే థ్రిల్ సినిమా మొత్తం ఉంటుంది. తప్పకుండా యువతను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ, మా థ్రిల్లర్ సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది’’ అన్నారు ప్రధాన పాత్రధారులు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, ఎడిటర్ ఆవుల వెంకటేష్ పాల్గొన్నారు. -
చక్కటి సందేశంతో...
మంచి వినోదంతో పాటు చక్కటి సందేశమున్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫాదర్’. కమల్కామరాజ్, సాయాజీషిండే ప్రధాన పాత్రల్లో జగదీశ్ వటర్కర్ దర్శకత్వంలో రాజ్ పచ్‌ఘరే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఈ వేసవి సెలవుల్లో తల్లితండ్రులతో కలిసి పిల్లలు చూడాల్సిన చిత్రం ఇది. ఏడో నాసిక్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది’’ అని నిర్మాత చెప్పారు. -
సెలబ్‌డబ్ సెలబ్రిటీస్ హార్ట్ బీట్
కమల్ కామరాజ్, సినీనటుడు గోదావరి, ఆవకాయబిర్యానీ.. వంటి సినిమాల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన యువ నటుడు కమల్ కామరాజ్.. చిత్రకారుడిగా సిటీకి ఎప్పటి నుంచో పరిచితుడు. మహిళలకు తన ఆర్ట్ ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటించే ఈ యంగ్ హార్టిస్ట్.. నిర్భయ సంఘటన తర్వాత 6 నెలలపాటు చెప్పుల్లేకుండా నడిచి.. తన నిరసనను తెలియజేశాడు. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన హృదయ స్పందన ఇది. ..:: ఎస్.సత్యబాబు మాది మొదటి నుంచీ నాస్తికవాదం. మా తాత ముత్తాతల దగ్గర్నుంచి అదే విధానం. అందుకే నాకు ఆధ్యాత్మిక నమ్మకాలు, కులాలు, కట్టుబాట్లు, ఆచారాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. పైగా మా ఇంట్లో, మా బంధువుల్లో అన్నీ ఇంటర్ రెలిజియస్, ఇంటర్ కాస్ట్, ఇంటర్ కంట్రీ.. మ్యారేజ్‌లే. స్కూల్లో ఎవరైనా నన్ను కులం గురించి అడిగితే అలా ఎందుకు అడుగుతున్నారో అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చి అమ్మానాన్నని అడిగితే... ‘మానవకులం’ అని చెప్పమన్నారు. నేను బెంగాలీ అమ్మాయిని చేసుకుంటున్నానని తెలిసినప్పుడు బాగా పరిచయస్థులు కూడా అదేదో విచిత్రమైన విషయంగా మాట్లాడారెందుకో. కట్నమెందుకివ్వాలో... వయసు పెరుగుతున్న కొద్దీ నాకు ఒక్కోటి తెలిసి వచ్చాయి. వ్యవస్థ సజావుగా నడవడానికి మనిషి చేసుకున్న అనేక ఏర్పాట్లలో కులమత సంప్రదాయాలు కూడా ఒకటి అని అర్థమైంది. అయితే ఆ తర్వాత కూడా నాకు ఎప్పటికీ అర్థం కాకుండా ఉంది ఆడవారి పరిస్థితి. నాతో పాటు ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయిలు కూడా కట్నం అనే విషయం చాలా సాధారణమైనదిగా, తమ పెళ్లి టైమ్‌లో ఎంతెంత కట్నం ఇవ్వాలో ముందే ఆలోచించుకునేవారు.. ఏమైనా అంటే నువ్వు తీసుకోవా అంటూ ఎదురు ప్రశ్నించేవారు. ఇంత ఆధునిక యుగంలోనూ ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే నేను తోడురానా అంటూ ఎవరో ఒకరు అడగడం బాగా ఆవేదన కలిగించే విషయం. ఇక భర్తకు ఏదైనా అయితే భార్య బయటకు రాకుండా కట్టడి చేయడం, ఆమెకు అలంకారాలన్నీ దూరం చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం.. ఇవన్నీ చూస్తూంటే సొసైటీ మొత్తం మహిళని ఇంతలా ఎందుకు బంధిస్తోంది? అనే ప్రశ్నలు వచ్చేవి. ఇలాంటి పరిస్థితులేవీ నేను మా ఇంట్లో చూడకపోవడం కూడా నాకు మరీ కొత్తగా అనిపించి ఎక్కువ బాధ కలిగించి ఉండొచ్చు. చెప్పులు విప్పేశా... ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన నన్ను బాగా కదిలించింది. ఆ ఆగ్రహం నా పెయింటింగ్‌లో ప్రతిఫలించింది. ఒక చిన్నపాప శరీరాన్ని కుక్కలు పీక్కుతింటుంటే రోడ్డు మీద చూస్తున్న వాళ్లంతా దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నట్టు చాలా తీవ్రమైన చిత్రం నానుంచి వచ్చింది. దీనికి వ్యక్తిగతంగా స్పందించాలని, నిరసన తెలియజేయాలని అనుకున్నా. అందుకే 6 నెలల పాటు కాళ్లకు చెప్పుల్లేకుండా తిరిగాను. చూసిన వాళ్లంతా ఎందుకలా అంటే ఇది నా నిరసన అంటూ విడమరిచి చెప్పేవాడ్ని. దర్శకులు, నాకు సన్నిహితులు శేఖర్‌కమ్ముల అప్పట్లో ‘ఐ రియాక్ట్ ఐ కేర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్నా. పలు కాలేజీలు, యూనివర్సిటీలకు తిరిగా. చిత్రం.. ఆమెకు అంకితం.. అసలు ఆడపిల్లలని చూసే దృక్పథంలోనే మార్పురావాలి. అమ్మాయిలకే అన్ని జాగ్రత్తలు కాదు అమ్మాయిల పట్ల ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అబ్బాయిలకు చెప్పాలి. తాజాగా మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘మిన్ను’ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా పూర్తిగా మహిళనే కేంద్రంగా తీసుకుని రూపొందించాను. ఆడశిశువు మరణాల నుంచి ఒకవేళ పుట్టి పెరిగాక కూడా తను ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని ప్రస్తావిస్తూ పలు చిత్రాలు గీశాను. మహిళ పట్ల అందరి ఆలోచనల్లోనూ సంపూర్ణ మార్పు రావాలి. అందుకోసం చిత్రాలు గీస్తా.. చెప్పుల్లేకుండా నడుస్తా.. తెలిసిన, వీలైన మార్గాల్లో ఆమె క్షేమానికి నా మద్దతు అందిస్తా. అది కాకుండా నాకు నచ్చే మరో అంశం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభ కాంతులీనేలా చేయడం. అందుకు ఆర్థిక పరిస్థితి అడ్డుకాకుండా చేసే యత్నాలకు తోడ్పాటు ఉంటుంది. క్యాప్ ఫౌండేషన్ అనే ఎన్జీవో 18 మంది చిన్నారులకు ఆశ్రయమిచ్చి వారిలో ఉన్న ప్రతిభ ఆధారంగా ప్రోత్సహిస్తున్న తీరు నాకు నచ్చింది. అప్పటి నుంచి వారికి నా వంతు సహాయసహకారాలు అందిస్తున్నా. -
నేత్రదానం నేపథ్యంలో...
తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫాదర్’. కమల్ కామరాజ్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిల్మ్ క్రియేటివ్ పతాకంపై రాజ్ పచ్‌ఘరె నిర్మించారు. జగదీష్ పటర్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పాటల సీడీని సాయాజీ షిండే ఇటీవలే హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నేత్రదానం నేపథ్యంలో సందేశంతో పాటు మంచి వినోదం ఉన్న చిత్రం ఇదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో శ్రీసురేశ్. నగేష్ నారదాశి, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కమల్ కళా సౌందర్యం
-
అర్థవంతమైన కథ... కథనాలతో...
కమల్కామరాజ్, మహత్, అడివి శేష్, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. పి.బి.మంజునాథ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ... ఎంవీకే రెడ్డితో కలిసి మధురా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుంచె రఘు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను లగడపాటి శ్రీధర్, సందీప్‌కిషన్, పంపిణీదారుడు అంజిరెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన మంచు మనోజ్, మధుశాలిని, హాయ్ రబ్బా స్మిత తదితరులందరూ పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. అర్థవంతమైన కథా, కథనాలతో సాగే సినిమా ఇదనీ, ఈ చిత్ర కథా రచయిత సంజీవ్‌రెడ్డిని ‘ఓం మంగళం మంగళం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేయబోతున్నాననీ మధురా శ్రీధర్ చెప్పారు. మల్టీస్టారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యువతరాన్ని ఆకట్టుకునే అంశాలెన్నో ఉంటాయనీ దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర బృందం మాట్లాడారు.