డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్ | Sodara Sodarimanulara Trailer Telugu | Sakshi
Sakshi News home page

Sodara Sodarimanulara Movie: ఇంట్రెస్టింగ్‌గా 'సోదర సోదరీమణులారా' ట్రైలర్

Published Sun, Sep 10 2023 5:03 PM | Last Updated on Sun, Sep 10 2023 5:30 PM

Sodara Sodarimanulara Trailer Telugu - Sakshi

కొత్త డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండ తీసిన సినిమా 'సోదర సోదరీమణులారా'. కమల్ కామరాజు, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే టైటిల్‌తో తీసిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!)

ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్.. ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచుతుంది. టైటిల్, పోస్టర్‌తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందనే ఫీలింగ్ కలుగుతుంది. వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రాఫర్ కాగా పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

(ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement