telugu new movie
-
అందుకే రాజీనామా చేశా!
‘‘ఇప్పటిదాకా మనకు మొత్తం సినిమాని ఇంటరాగేషన్ మీద తీయలేదు. ‘ది ట్రయల్’ సినిమా కథ ఇంటరాగేషన్ రూమ్ నుంచి మొదలై అదే గదిలో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అంటున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గన్ని. స్పందనా పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. దర్శకుడు రామ్ గన్ని మాట్లాడుతూ– ‘‘2012 నుంచి 2022 వరకు డిప్యూటీ జైలర్‌గా చేశాను. సినిమాలపై ఫ్యాషన్‌తో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకునిగా ‘ది ట్రయల్’ నా తొలి చిత్రం. డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్లో ఎన్నో నేర ఘటనల గురించి, ఆ నేరాలు చేసిన ఖైదీల కథలను విన్నాను. వాటి స్ఫూర్తితో ఫిక్షనల్‌గా రాసుకున్న కథ ‘ది ట్రయల్’’ అన్నారు. -
డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్
కొత్త డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండ తీసిన సినిమా 'సోదర సోదరీమణులారా'. కమల్ కామరాజు, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే టైటిల్‌తో తీసిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్.. ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచుతుంది. టైటిల్, పోస్టర్‌తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందనే ఫీలింగ్ కలుగుతుంది. వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్లలో సెప్టెంబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రాఫర్ కాగా పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. (ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ) -
రైతు నాయకుడు
శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గణేష్’. ది లీడర్.. అనేది ఉప శీర్షిక. ‘‘రైతుబజార్లో రైతులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించే రైతు నాయకుడు ‘గణేష్’ కథ ఇది. పక్కా మాస్ చిత్రమిది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు శివ జొన్నలగడ్డ. చదలవాడ హరిబాబు, చంద్రమోహన్, కాదంబరి కిరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: బాపు.