
కమల్ కామరాజ్, మౌర్యాణి
సమాజంలో ప్రతి మనిషి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించకుంటే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లా’. ‘లవ్ అండ్ వార్’ అనేది ఉపశీర్షిక. కమల్ కామరాజ్, మౌర్యాణి జంటగా గగన్ గోపాల్ దర్శకత్వంలో రమేశ్‌బాబు మున్నా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ –‘‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ, గగన్ గోపాల్ చాలా డీటైల్డ్‌గా కథ చెప్పాడు.
ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. సినిమా కథనం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఈ సినిమాను ఎక్కువ భాగం విజయవాడలో తీశాం’’ అన్నారు. ‘‘మంచి ట్వస్ట్‌లతో, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనాలతో ‘లా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సత్య కశ్యప్ మ్యూజిక్ సినిమాకి ప్రధానం బలం’’ అన్నారు గగన్ గోపాల్ ముల్క. నిర్మాతలు, మౌర్యాణి పాల్గొన్నారు. పూజా రామచంద్రన్, మంజు భార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సహనిర్మాత: మద్దిపాటి శివ.
Comments
Please login to add a commentAdd a comment