Mouryani
-
ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ‘పింకీ’
కిరణ్, మౌర్యాణి జంటగా నటించిన తాజా చిత్రం ‘పింకీ’. సీరపు రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుమన్ , శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్ గా విడదులకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..`జనం, జరిగిన కథ చిత్రాలు చేసిన దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ గారు. ఆయన దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తన నిర్మాణంలో వస్తోన్న ఈ పింకీ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా` అన్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు సినిమా. ఈ సినిమా విడుదలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా` అన్నారు. దర్శకుడు సీరపు రవి కుమార్ మాట్లాడుతూ...`ఇది నా మొదటి సినిమా. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరించారు. ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్` అన్నారు. నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ..`సీరపు రవి కుమార్ చెప్పిన కథ నచ్చడంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు. -
గీత గోవిందం ఫేమ్ మౌర్యానీ బ్యూటిఫుల్ ఫొటోస్
-
లవ్ అండ్ వార్
కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘లా’ (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్క దర్శకత్వంలో రమేష్ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్ గోపాల్. ‘‘లా’తో హీరోగా నేను రీ లాంచ్ అంటున్నారు. అవేమీ పెద్దగా నమ్మను. ఈ సినిమాకి మొదటి హీరో స్క్రీన్‌ప్లే. ‘లా’ని ఫాలో చేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ని ఫాలో అయినట్లే’’ అని కమల్ కామరాజ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సంగీతం: సత్య కశ్యప్, సహ నిర్మాత: మద్దిపాటి శివ. -
లవ్ అండ్ వార్
సమాజంలో ప్రతి మనిషి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించకుంటే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లా’. ‘లవ్ అండ్ వార్’ అనేది ఉపశీర్షిక. కమల్ కామరాజ్, మౌర్యాణి జంటగా గగన్ గోపాల్ దర్శకత్వంలో రమేశ్‌బాబు మున్నా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ –‘‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ, గగన్ గోపాల్ చాలా డీటైల్డ్‌గా కథ చెప్పాడు. ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. సినిమా కథనం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఈ సినిమాను ఎక్కువ భాగం విజయవాడలో తీశాం’’ అన్నారు. ‘‘మంచి ట్వస్ట్లతో, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనాలతో ‘లా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సత్య కశ్యప్ మ్యూజిక్ సినిమాకి ప్రధానం బలం’’ అన్నారు గగన్ గోపాల్ ముల్క. నిర్మాతలు, మౌర్యాణి పాల్గొన్నారు. పూజా రామచంద్రన్, మంజు భార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సహనిర్మాత: మద్దిపాటి శివ. -
నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు
సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ ముఖ్య తారలుగా సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై వీజే రెడ్డి దర్శకత్వంలో సీహెచ్ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ–‘‘ నలుగురికి మేలు చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే అంశాలు ఆసక్తిగా ఉంటాయి. సెంటిమెంట్ చిత్రమైనా వినోదానికి కొదవ లేదు ’’ అన్నారు. ‘‘నెల్లూరి పెద్దారెడ్డి పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రహ్మణి, సంగీతం: గురురాజ్. -
యాక్షన్ ఎంటర్టైనర్
అర్జున్ యాజెస్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. భానుశంకర్ .పి దర్శకత్వంలో రవికుమార్. ఎమ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్తికొండ కుమారస్వామి కెమెరా స్విచాన్ చేయగా, సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కొంతమంది పెద్ద హీరోలకు ఈ కథ చెప్పాను. వారికి ఈ కథ నచ్చినా, నటించడానికి సంశయించారు. అందుకే కొత్తవారితో చేస్తున్నా. ఇది యాక్షన్ ఎంటర్టైనర్’’ అని చెప్పారు. ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తామని, పత్తికొండ కుమారస్వామి సహకారం మరవలేనిదని నిర్మాత అన్నారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు రవివర్మ తెలిపారు. సీనియర్ హీరోలు చేయాల్సిన పాత్రను చేస్తున్నానని, ఈ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని అర్జున్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీనివాస్.