యాక్షన్ ఎంటర్‌టైనర్ | Action Entertainer movie | Sakshi
Sakshi News home page

యాక్షన్ ఎంటర్‌టైనర్

Published Mon, Jul 14 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

యాక్షన్ ఎంటర్‌టైనర్

యాక్షన్ ఎంటర్‌టైనర్

అర్జున్ యాజెస్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. భానుశంకర్ .పి దర్శకత్వంలో రవికుమార్. ఎమ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్తికొండ కుమారస్వామి కెమెరా స్విచాన్ చేయగా, సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కొంతమంది పెద్ద హీరోలకు ఈ కథ చెప్పాను.
 
 వారికి ఈ కథ నచ్చినా, నటించడానికి సంశయించారు. అందుకే కొత్తవారితో చేస్తున్నా. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్’’ అని చెప్పారు. ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తామని, పత్తికొండ కుమారస్వామి సహకారం మరవలేనిదని నిర్మాత అన్నారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు రవివర్మ తెలిపారు. సీనియర్ హీరోలు చేయాల్సిన పాత్రను చేస్తున్నానని, ఈ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని అర్జున్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement