
తమిళ స్టార్ హీరో సూర్య.. మరో క్రేజీ దర్శకుడితో పనిచేయబోతున్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ 'కంగువ'తో బిజీగా ఉన్న సూర్య.. దీని తర్వాత వరసగా సుధా కొంగర, వెట్రిమారన్ లాంటి క్రేజీ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. ఇది కాదన్నట్లు లోకేష్ కనకరాజ్ తీసే 'రోలెక్స్'లోనూ సూర్య లీడ్ రోల్ చేయనున్నాడు. వీటిలో వెట్రిమారన్, లోకేశ్ చిత్రాలు తీయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంతలో మరో యువ దర్శకుడిక సూర్య బంపరాఫర్ ఇచ్చినట్లు టాక్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
గతంలో 'అండ్రు నేట్రు నాళై' లాంటి డిఫంట్ సినిమా తీసిన రవికుమార్.. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో 'అయలాన్' తీశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం.. జనవరి 12న అంటే ఈ వారాంతంలోనే థియేటర్లలోకి రానుంది. ఇంతలోనే సూర్య నుంచి ఈ దర్శకుడికి పిలుపొచ్చిందనే న్యూస్ వైరల్ అవుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
(ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)
Comments
Please login to add a commentAdd a comment