నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు | Nellore Pedda Reddy release date announced | Sakshi
Sakshi News home page

నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు

Published Mon, Mar 12 2018 1:57 AM | Last Updated on Mon, Mar 12 2018 1:57 AM

Nellore Pedda Reddy release date announced - Sakshi

మౌర్యానీ, సతీష్‌ రెడ్డి

సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ ముఖ్య తారలుగా సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై వీజే రెడ్డి దర్శకత్వంలో సీహెచ్‌ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 16న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ–‘‘ నలుగురికి మేలు చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తాడు.

ఈ క్రమంలో అతను ఎలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే అంశాలు ఆసక్తిగా ఉంటాయి. సెంటిమెంట్‌ చిత్రమైనా వినోదానికి కొదవ లేదు ’’ అన్నారు. ‘‘నెల్లూరి పెద్దారెడ్డి పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. 28 రోజుల్లోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం’’ అన్నారు సతీష్‌ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రహ్మణి, సంగీతం: గురురాజ్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement