munthaj
-
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట స్థానానికి అహ్మద్ బలాల, కార్వాన్కు కౌసర్ మోహియుద్దీన్, నాంపల్లికి మాజీద్ హుస్సేన్, చార్మినార్‌కు జుల్ఫీకర్, యాకుత్‌పురాకు జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. ఉద్దండులకు మొండిచేయి.. రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది. నాంపల్లి సిట్టింగ్ స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌కు, చార్మినార్ సిట్టింగ్ స్థానాన్ని జుల్ఫీకర్లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. కొత్తగా జూబ్లీహిల్‌లో.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్షాన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. డబుల్ హ్యాట్రిక్.. 'ఓటమి ఎరగని నేతగా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనంతరం ముంతాజ్ ఖాన్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్ జుల్ఫీకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్ ఖాన్ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఇవి చదవండి: అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు! -
ఓ వదిన.. క్రైమ్‌స్టోరీ
-
విజయవాడలో ఘోరం
విజయవాడ: ఆవేశం ఆ ఇల్లాలిలోని మానవత్వాన్ని చంపేసింది. కొడుకులా చూసుకోవాల్సిన మరిదిపైనా, చెల్లెలిలా చూసుకోవాల్సిన ఆడపడుచుపైనా కక్షపెంచుకునేలా చేసింది. కసాయిగా మారిన వదినే ఆ ఇద్దరి పాలిట అపరకాళికను చేసింది. విజయవాడలో సంచలనం రేకెత్తించిన సంఘటన కానూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. పైఫోటోలో కనిపిస్తోన్న మహిళ పేరు ముంతాజ్. మానసిక వ్యాధితో బాధపడుతోన్న ఆడపడుచు హసీనా వైద్యానికి భర్త సంపాదన ఖర్చు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. పెళ్లికి ముందు వరకు తనతో బాగుండిన మరిది ఖలీల్ ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పగపట్టింది. ఇద్దరినీ అంతమొందించాలని స్కెచ్ వేసింది. కుట్రలో భాగంగా హసీనా, ఖలీల్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆడపడుచు హసీనా అక్కడికక్కడే మృతిచెందింది. 80 శాతం గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఖలీల్‌ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంతాజ్ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు
సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ ముఖ్య తారలుగా సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై వీజే రెడ్డి దర్శకత్వంలో సీహెచ్ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ–‘‘ నలుగురికి మేలు చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే అంశాలు ఆసక్తిగా ఉంటాయి. సెంటిమెంట్ చిత్రమైనా వినోదానికి కొదవ లేదు ’’ అన్నారు. ‘‘నెల్లూరి పెద్దారెడ్డి పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రహ్మణి, సంగీతం: గురురాజ్. -
జులాయి..
అదనపు కట్నం కోసం వేధింపులు భార్యాపిల్లలపై అంతులేని నిర్లక్ష్యం తరచూ ఇంటి నుంచి అదృశ్యం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఫినాయిల్ తాగి బెదిరింపులకు దిగిన శాడిస్టు అనైతిక వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో చిచ్చురేపింది. వరుసకు అత్త అయిన వివాహితతో సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పెద్దలు పంచాయితీ నిర్వహించి, భార్యను సక్రమంగా చూసుకోవాలని హితవు పలికారు. అయితే తన వివాహేతర సంబంధం గుట్టురట్టు చేసిన ఇల్లాలిపై కక్ష కట్టిన అతను పథకం ప్రకారం అదనపుకట్నం పేరిట వేధింపులకు దిగాడు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో తనకు విముక్తి కల్పించాలని బాధితురాలు వేడుకుంటోంది. గుంతకల్లు రూరల్: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సైరాబాను, లతీఫ్ దంపతుల కుమార్తె ముంతాజ్‌కు గుంతకల్లులోని పక్కీరప్ప కాలనీ నివాసి షర్ఫుద్దీన్ కుమారుడు రహిమాన్‌తో ఏడేళ్ల కిందట వివాహమైంది. కట్నకానుకల కింద రూ.1.2 లక్షలు, 8 తులాల బంగారు నగలతోపాటు ఒక మోటార్‌సైకిల్‌ను ఇచ్చారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. వరుసకు అత్త అయిన వివాహితతో రహిమాన్ అనైతిక సంబంధం కొనసాగిస్తూ వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... తన భర్తకు హితవు పలికింది. అప్పటి నుంచి భార్యాకుమార్తె బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకోవడంతో అత్తతో పాటు ఉడాయించాడు. రోజులు గడుస్తున్నా... భర్త తిరిగి రాకపోవడంతో ముంతాజ్ తన పుట్టింటికి చేరుకుంది. ఏడాది తర్వాత.. ఏడాది తర్వాత రహిమాన్ తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. తన తండ్రి మరణానంతర 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అప్పటికే ‘మిస్సింగ్’ కేసులో నిందితుడిగా ఉన్న రహిమాన్‌ను కసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని బంధువులు అతడిని స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మత పెద్దలు, అంజుమన్ కమిటీ సభ్యుల సమక్షంలో రహిమాన్ తన భార్యతో కలిసి ఉండేలా అగ్రిమెంట్ రాయించారు. అదనపు కట్నం వేధింపులు అగ్రిమెంట్ అనంతరం భార్యతో కలిసి బెంగళూరుకు మకాం మార్చిన రహిమాన్ రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని అదనపు కట్నం కోసం భార్యను హింసించేవాడు. డబ్బు ఇవ్వగానే తీసుకుని పది రోజులపాటు కనిపించకుండా వెళ్లిపోయేవాడు. కూతురుని అల్లుడు పెట్టే చిత్రహింసలు చూడలేక అడిగిన ప్రతిసారీ అత్తమామలు డబ్బు ముట్టజెప్పేవారు. ఈ ఏడాది రంజాన్ పండుగ కోసమని భార్య, కూతురుతో రహిమాన్ గుంతకల్లుకు వచ్చాడు. రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులను ఆశ్రయించిన భార్య తన భర్త ప్రవర్తనతో ముంతాజ్ విసిగిపోయింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ మూడు రోజుల కిందట కసాపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కౌన్సెలింగ్‌తో భార్య, కూతురుతో కలిసి ఉండేందుకు అంగీకరించిన రహిమాన్ గురువారం రోజు రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడు కావాలనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు మొర పెట్టుకుంది.