sathish reddy
-
అన్నా చెల్లెళ్ల మధ్య గొడవ.. అక్కడే మొదలైంది
-
డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం
డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీల్లో ఆయన విశేష కృషిని ఇస్రో గుర్తింపుగా స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఎస్ఎస్ఎంఈ) సతీష్ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేసింది.అహ్మదాబాద్‌లోని ఇస్రో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, ఎస్ఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ డి.కె.సింగ్ ల సమక్షంలో రక్షణ మంత్రి మాజీ శాస్త్రీయ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీష్ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేశారు. -
TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్
సాక్షి,మహబూబ్‌నగర్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మాజీ చైర్మన్ డాక్టర్.జిసతీష్‌రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్వెల్ వేడుకలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. -
కొత్త వివాదంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. టీఆర్ఎస్ ఆరోపణేంటి?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన చర్చల్లో గవర్నర్ బహిరంగంగా పాల్గొంటున్నారని టీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాజకీయంగా తటస్థంగా ఉండాల్సిన గవర్నర్ పదవికి కళంకం తీసుకువచ్చారని విమర్శలు చేశారు. ‘2024 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ వ్యూహం’అనే అంశంపై తమిళనాడు బీజేపీకి చెందిన వ్యక్తులు శుక్రవారం ‘ట్విట్టర్ స్పేస్’వేదికగా నిర్వహించిన చర్చలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారని ఆరోపించారు. ఈ చర్చలో పాల్గొన్న వారి జాబితాలో గవర్నర్ తమిళిసై అధికారిక ట్విట్టర్ ఖాతా సైతం ఉందని టీఆర్ఎస్ చెబుతోంది. కాగా, ఈ ఆరోపణలు నిరాధారమైనవని శనివారం రాజ్‌భవన్ తోసిపుచ్చింది. గవర్నర్ రాజకీయపార్టీ నిర్వహించిన చర్చలో పాల్గొన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్‌భవన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయండి
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్డీవో, ఎన్ఐటీలు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధిని అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివరించారు. స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లలోనే భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన నిలిచిందని తెలిపారు. స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి.. అంటే 2047కు అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిపారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధికశాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఉత్సుకత చూపుతున్నారని చెప్పారు. ఇటీవల 60 వేల స్టార్టప్‌లు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా మహమ్మారి ప్రబలిన మూడున్నర నెలల్లోనే.. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన ఘనత మనకు దక్కిందన్నారు. కరోనా మహమ్మారి తొలి దశలో విరుచుకుపడినప్పుడు డీఆర్డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రోజుకు నాలుగు లక్షల పీపీఈ కిట్లు, 60 వేలకుపైగా వెంటిలేటర్లను తయారుచేసి, దేశంతో పాటు ప్రపంచానికీ అందించామన్నారు. రక్షణ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో వివిధ రకాల క్షిపణులను తయారుచేశామని వివరించారు. వీటిని దేశ రక్షణ అవసరాలకు వినియోగించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్‌ను తయారుచేశామని చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్‌లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను డీఆర్డీవో రూపొందించిందన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్‌లను విరివిగా తయారుచేయాలని యువతకు సూచించారు. -
స్టార్టప్స్‌కు ఆర్థిక సాయం అందిస్తాం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు)/గోపాలపట్నం (విశాఖ పశి్చమ): రక్షణ రంగానికి ఎదురవుతోన్న అనేక సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు చూపే స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు ఆర్థిక సహకారం అందిస్తామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యకు రూ.కోటి వరకు అందించే వెసులుబాటు తమకు ఉందన్నారు. ఈ దిశగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నెలకొల్పుతున్న ఇంక్యుబేషన్ కేంద్రం దృష్టిసారించాలని సూచించారు. శుక్రవారం సతీష్‌రెడ్డి ఏయూని సందర్శించి ఆచార్యులతో సమావేశమయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. తర్వాత ఆచార్యులతో మాట్లాడుతూ.. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించి ఏయూతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏయూలో ఏర్పాటవుతున్న ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీ.. మైసూరులోని డీఆర్డీవో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీతో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ఆహా్వనించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సైతం పరిశోధన భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బెంగళూరు, ఢిల్లీల్లో ఉన్న తమ ప్రయోగశాలల్లో కలసి పనిచేస్తూ తగిన పరిష్కారాలు చూపాలన్నారు. డిఫెన్స్ టెక్నాలజీపై ఏఐసీటీఈ సహకారంతో పలు ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నామని.. వీటిని ఏయూలోనూ ప్రవేశపెట్టాలని కోరారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులకు తమ ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి.. వర్సిటీ ఆచార్యులు చేస్తోన్న రక్షణ రంగ పరిశోధన ప్రాజెక్టుల వివరాలు, వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సతీష్‌రెడ్డిని వర్సిటీ తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరిప్రసాద్, డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ కామత్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తిని సాధించాలి.. కాగా, స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు నేవల్ సైన్స్ టెక్నాలజీ లే»ొరేటరీ (ఎన్ఎస్టీఎల్) కృషి చేయాలని, దిగుమతులు తగ్గించుకునేలా వృద్ధి చెందాలని సతీష్‌రెడ్డి సూచించారు. విశాఖ మానసి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్టీఎల్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీఎల్ రూపొందించిన హైపవర్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని పుణేకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంస్థకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను సతీష్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2–డీజీ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2–డీఆక్సీ–డీ గ్లూకోజ్ (2–డీజీ) సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంగళవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ... కరోనా నిర్వహణలో 2–డీజీ కీలకం అవుతుందని ఆయన పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 2–డీజి సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాతే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ మందు అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసిందని చెప్పారు. అదే విధంగా... మధ్యమ స్థాయి లక్షణాలున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. మానవ ప్రయోగాల్లో ఇది 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రోగుల్లోనూ సమర్థంగా పని చేసిందని తెలిపారు. గతే డాది ఏప్రిల్‌లో తాము సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సాయంతో ఈ మందుపై పరిశోధనలు ప్రారంభించామని చెప్పారు. 2–డీజీ పనితీరు వినూత్నం: సతీశ్‌రెడ్డి వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనా వైరస్‌ను 2–డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. 2–డీజీపై జరిగిన పరిశోధనలు అది సురక్షితమైందేనన్న విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు రమాకాంత్ ఇన్నాని, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నతాధికారి దీపక్ సప్రా, హెల్త్‌కేర్ కమిటీ చైర్ పర్సన్ శేఖర్ అగర్వాల్ వెబినార్‌లో పాల్గొన్నారు. చదవండి: బరువు తక్కువ.. పవరెక్కువ.. ప్రపంచాన్ని వణికిస్తోంది 3 కిలోల కరోనా! -
వాతావరణంలోని గాలితో..! నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా దేశంలో ఏర్పడ్డ ఆక్సిజన్ కొరత నివారణకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నడుం బిగించింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించి.. దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటీ నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంతో 190 మందికి ఆక్సిజన్ అందించవచ్చని.. అదనంగా 195 సిలిండర్లను నింపవచ్చని డీఆర్డీవో బుధవారం ఓ ప్రకటన వెల్లడించింది. బెంగళూరులోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, కోయంబత్తూరుకు చెందిన ట్రైడెంట్ న్యూమాటిక్స్‌లకు ఇప్పటికే టెక్నాలజీని బదలాయించామని.. ఆ రెండు సంస్థలు 380 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసి డీఆర్డీవోకు అందిస్తాయని తెలిపింది. సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మరో 120 ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తుందని వివరించింది. పీఎస్ఏ టెక్నాలజీతోనే.. డీఆర్డీవో తయారు చేస్తున్న మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు అన్నీ ‘ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ (పీఎస్ఏ)’టెక్నాలజీతో పనిచేస్తాయి. వాతావరణం నుంచి గాలిని పీల్చుకుని.. జియోలైట్ పదార్థం సాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 933% గాఢతతో ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. దీన్ని నేరుగా కోవిడ్ రోగులకు అందించవచ్చు. అవసరమైతే సిలిండర్లలో నింపుకోవచ్చు. ఆస్పత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఖర్చులు కలిసివస్తాయని.. సుదూర, ఎత్తైన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్డీవో పేర్కొంది. పీఎం కేర్స్ నిధుల ద్వారా నెలకు 120 చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తామని వెల్లడించింది. డీఆర్డీవో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఆ ప్రయోగాలు చేయడం లేదు: సతీష్ రెడ్డి
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం డీఆర్డీఓ అనేక నూతన ఆవిష్కరణలు చేస్తోందని ఆ సంస్థ చెర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. శానిటైజర్లు, మాస్క్‌లు, వెంటిలేటర్స్ తయారు చేయడంతో పాటు.. నాలుగైదు లక్షల లీటర్ల శానిటైజర్ బాటిల్స్ పంచినట్లు తెలిపారు. ప్రతిరోజు 25 వేల ఎన్ 99 మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న టెక్నాలజీని అవసరమైన పరిశ్రమలకు అందజేస్తున్నామని తెలిపారు. ఐసీయూలో పనిచేసే వైద్యుల కోసం ప్రత్యేకంగా ఫుల్ మాస్క్ కిట్లను రూపొందించామన్నారు. టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు తాము జరపడం లేదని తెలిపిన సతీష్‌రెడ్డి.. చిత్ర అనే సంస్థ దీనిపై పని చేస్తోందని పేర్కొన్నారు. అయితే తాము ఆ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్ఫ్రారెడ్ థర్మమీటర్ని తయారు చేశాం. టచ్ చేయకుండా ఉపయోగించే శానీ టైసింగ్ కిట్లను రూపొందించాం. రేపటి నుంచి ఆఫీసులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి. కేవలం ఐదు వేల రూపాయలకు ఈ బాక్స్ అందుబాటులో ఉన్నాయి. డీఆర్డీఓలో తయారు చేసిన పీపీఈలు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. పీపీఈ కిట్లను సర్టిఫై చేసేందుకు ప్రత్యేకంగా భూపాల్‌లో ఉన్న మా ల్యాబ్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించాం. హైదరాబాదులో 20 వేల ఫుల్ ఫేస్ మాస్క్‌లను తయారు చేసి పంచాము. ఏరో సిల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను కూడా డాక్టర్ల కోసం తయారు చేసి ఆసుపత్రులకు ఇచ్చాం. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆస్పత్రి సహకారంతో వీటిని రూపొందించాము. ఒక వెంటిలేటర్ అనేక మందికి ఉపయోగపడేలా.. ప్రతిసారీ పీపీఈ సూట్ ధరించకుండా నేరుగా ఒక ప్రత్యేక చాంబర్ తయారుచేశాం. ఈ చాంబర్ ద్వారా డాక్టర్లు రోగులను నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో డాక్టర్లు సేఫ్ ఉంటారు. ఒక వెంటిలేటర్‌ను అనేకమందికి ఉపయోగించేలా ప్రయోగం చేశాం. ఈ ప్రయోగాన్ని పరీక్షించి మరింతగా మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలో ఈ పరికరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫుల్ బాడీ చాంబర్ లను తయారు చేస్తున్నాం. ప్రతిసారి బాటిల్ పట్టుకోకుండా రిమోట్ సెన్సింగ్‌తో బాటిల్ స్ప్రే చేసుకునేలా బాక్స్ రూపొందించాం. ప్రతి ఆఫీసు ఎంట్రెన్స్‌లో ఈ బాక్స్‌ను పెట్టుకోవచ్చు. అల్ట్రా వైలెట్ టెక్నాలజీ తో శానిటైజ్ చేసే టెక్నాలజీ రూపొందించాం. అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది.. టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు మేము జరపడం లేదు. చిత్ర అనే సంస్థ టెస్ట్ కిట్లపై పని చేస్తుంది. ఆ సంస్థలకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. వీలైనంతవరకు టెస్టులు పెరగాలి. అయితే అందరికీ కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాదు. బయో వార్ , వైరస్ లను ఎదుర్కొనేందుకు అన్ని మంత్రిత్వశాఖలు కలిసి ప్రయోగాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను తాము చేసే పనిలో భాగంగానే రూపొందిస్తున్నాయి. ఈ ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే సఫలీకృతమవుతాయి. దాంతో దేశంలోని సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ముప్పు ను అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది. రక్షణ శాఖ అప్రమత్తంగా ఉంది.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకున్నారు. మాస్కులు, మందులు, వ్యాక్సిన్లు తయారీ ద్వారా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో ఈ ప్రయోగాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ముంబై నౌకాదళంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రిత్వ శాఖ.. అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ పూర్తి సంసిద్ధత తో ఉంది. ఎక్కువ పరిశ్రమలకు టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా భారీ సంఖ్యలో వెంటిలేటర్లు తయారు చేస్తున్నాము. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ సింగ్ అందరూ పాటించాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు’ అని తెలిపారు. -
ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..!
జిల్లా టీడీపీ దాదాపు ఖాళీ అయ్యిందా..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. గతేడాది అసెంబ్లీ ..లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ చికిత్సకు అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో జనరంజకంగా ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సర్కారు దూసుకెళుతుండటంతో ఆ పార్టీ నాయకులు టీడీపీలో కొనసాగడానికి నేతలు విముఖంగా ఉన్నారు. రోజురోజుకూ ఇలాంటి నాయకులు పెరుగుతున్నారు. పులివెందులలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీ పూర్తిగా చతికిలపడిపోయింది. సాక్షి, కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్వీ సతీష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పార్టీని వీడటం టీడీపీకి గట్టి షాక్‌గా భావించవచ్చు. ఆయన రాజీనామాతో అరకొరగా ఉన్న అక్కడి క్యాడర్పార్టీకి పూర్తిగా దూరమైనట్లే. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి స్థానిక ఎన్నికల ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సతీష్‌రెడ్డి రాజీనామాతోపాటు మరికొందరు అదేబాటలో ఉన్నారనే సమాచారం ఆ పార్టీ శిబిరం పూర్తిగా డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికల్లో కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పరిశీలకుల భావన. మరికొందరు నేతలు సైతం పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు ఇప్పటికే బీజేపీ పంచన.. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీకొట్టడంతో జిల్లాలోని పది అంసెబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘోర పరాజయ పాలైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో జిల్లా టీడీపీ నేతలు కలవరపడ్డారు. ఆ పార్టీ పాత కాపు సీఎం రమేష్ భవిష్యత్తు లేదని భావించి టీడీపీని వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదేబాట పట్టారు. అరకొరగా ఉన్న నేతలు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చూస్తుండగానే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు మొదలైన మరుసటి రోజే ఆ పార్టీ కీలకనేత ఎస్వీ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మరికొందరు నేతలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో చీకట్లు ప్రొద్దుటూరుకు చెందిన ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను స్థానిక ఎన్నికలకు దూరమని ప్రకటించి టీడీపీని వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా లోనైనట్లు తెలుస్తుంది. వరదరాజుల రెడ్డి అనుచరవర్గంఈ ఎన్నికల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడినా మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్తియార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడి వర్గం ఆ పార్టీపై గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే అంసతృప్తితో ఉంది. ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తన అనుచరులతో కలిసి టీడీపీని వీడనున్నారన్న ప్రచారం జరుగుతోంది. బద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అరకొరగా మిగిలి ఉన్న టీడీపీ నేతలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడం లేదు. కొందరు రెండో శ్రేణి నేతలు సైతం ఈ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం, జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నారు. టీడీపీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో అధికార పార్టీ విజయం ఏకపక్షమేనని పరిశీలకుల అంచనా.వరుసగా ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడతుండటంతో టీడీపీ జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. -
అవి 45 రోజుల్లో మాయం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంస క్షిపణి ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతరిక్షానికి ముప్పు ఉంటుందన్న నాసా వాదనల్ని భారత్ మరోసారి కొట్టిపారేసింది. ఈ ప్రయోగం కోసం తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యను ఎంచుకున్నామని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి చెప్పారు. దీంతో అంతరిక్షంలోని నిర్మాణాలు, ఇతర ఆస్తులకు శకలాల బెడద లేదని వివరణ ఇచ్చారు. రాబోయే 45 రోజుల్లో ఆ శకలాలు నిర్వీర్యమవుతాయని అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సతీశ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఇంటర్సెప్టార్ క్షిపణితో భూమి నుంచి 300 కి.మీ ఎత్తులోని కక్ష్య(ఎల్ఈవో)లో ఏశాట్ ప్రయోగం నిర్వహించామని తెలిపారు. కొన్ని శకలాలు పైకక్ష్యలోకి వెళ్లే అవకాశాలున్నాయని, కానీ వాటితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చే ముప్పేమీ లేదని చెప్పారు. ప్రయోగం ముగిసిన తొలి పది రోజులు కీలకమని, ఆ గడువు సజావుగా ముగిసిందని ఆయన వెల్లడించారు. ఆ క్షిపణికి వేయి కిలో మీటర్ల పరిధిలో గల లక్ష్యాలను కూడా తాకే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఒకే సారి ఒకటి కన్నా ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే సత్తా ఏశాట్‌కు ఉందా? అని ప్రశ్నించగా, బహుళ లాంచర్లతో అది సాధ్యమేనని అన్నారు. అంతకుముందు, ఉదయం ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశమై ఏశాట్ ప్రయోగం గురించి వివరించినట్లు తెలిపారు. తెలివితక్కువ ప్రభుత్వాలే రక్షణ శాఖ రహస్యాలను బహిర్గతం చేస్తాయన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఏశాట్ గమనాన్ని ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారని, ఇలాంటి ప్రయోగాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఆరు నెలలు.. 150 మంది శాస్త్రవేత్తలు: మార్చి 27న ఏశాట్ క్షిపణితో భారత్ తన సొంత ఉపగ్రహాన్ని కూప్పకూల్చి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రష్యా, అమెరికా, చైనా సరసన నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం 40 మంది మహిళలు సహా మొత్తం 150 మంది శాస్త్రవేత్తలు ఆరు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. 50 ప్రైవేట్ సంస్థల నుంచి ఇందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చాం. ప్రయోగం నిర్వహించాలని కేంద్రానికి 2014లో ఆలోచన వచ్చినా 2016లో అనుమతిరావడంతో ఏర్పాట్లు చేశారు. ప్రయోగం విజయవంతంగా ముగిశాక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్పందిస్తూ ఏశాట్ ప్రయోగంతో అంతరిక్షంలో 400 శకలాలు పోగయ్యాయని ఆక్షేపించిన సంగతి తెలిసిందే. -
సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్ రెడ్డి
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్.వి.సతీష్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సతీష్‌రెడ్డి, సుధాకరరెడ్డి ఆరోపణలెదుర్కొంటున్న సంగతి తెల్సిందే. శుక్రవారం ఓ చానెల్లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
నెల్లూరు రైతు బిడ్డ.. రక్షణరంగ శిఖరం
నెల్లూరు సీమలో సాధారణ రైతు బిడ్డగా పుట్టారు. భారతదేశానికి అత్యంత కీలకమైన రక్షణ రంగంలో శిఖరం అయ్యారు. చిరుప్రాయం నుంచే చురుకైన వాడిగా అందరిలో గుర్తింపు పొందిన గుండ్రా సతీష్‌రెడ్డి.. ఇప్పుడు భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగాడు. భారతదేశ రక్షణ రంగంలో డీఆర్డీఓ చైర్మన్‌గా నియమితులై శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింహపురి వాసులు ఆనందడోలికల్లో మునిగిపోయారు.ఈ కీలక బాధ్యతలకు సంబంధించి శనివారం ఆదేశాలు వెలువడిన సమయంలో ఆయన నెల్లూరు నగరంలోనే ఉన్నారు. ఆయన్ను కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు అభినందనలతో ముంచెత్తారు. ఆత్మకూరురూరల్: భారతదేశ రక్షణ రంగంలో కీలక పదవిని అధిరోహించారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ, జాతీయ అవార్డులు ఆయన్ను వరించాయి. భారత రక్షణశాఖ క్షిపణిరంగ పరిశోధకుడిగా ఎన్నో విజయాలను సాధించి పెట్టారు. అంతర్జాతీయ సాంకేతిక రంగ నిపుణుల మన్ననలు పొందారు. ఎంత ఉన్నతికి ఎదిగినా జన్మభూమిపై మమకారాన్ని వదులుకోలేదు. స్వగ్రామాన్ని దత్తత తీసుకుని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆయనే ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన గుండ్రా సతీష్‌రెడ్డి. డీఆర్డీఓ చైర్మన్‌గా నియమితులైనట్టు తెలియడంతో శనివారం ఆయన స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి. తమ మధ్యే తిరుగుతూ ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడంపై ఆ గ్రామంలోని ఆయన బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, గ్రామస్తులు సంతోషంతో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సతీష్‌రెడ్డి చదివిన ఉన్నత పాఠశాలలో స్థానిక నేత నిజమాల నరసింహులు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీట్లు పంచి సతీష్‌రెడ్డి జీవిత ప్రస్థానాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి వివరించారు. పలువురు గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ తమ గ్రామానికి సతీష్‌రెడ్డి ద్వారా దక్కిన గౌరవానికి గర్వపడుతున్నామన్నారు. జన్మభూమిపై మమకారం అంతర్జాతీయ స్థాయిలో ధృవతారగా వెలుగొందుతున్న జన్మభూమిపై మమకారం తగ్గకుండా స్వగ్రామమైన ఆత్మకూరు మండలం మహిమలూరును దత్తత తీసుకుని పలు రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. భార్య పద్మావతి, తనకన్నా పెద్దవాడైన సోదరుడు గుండ్రా శ్రీనివాసులురెడ్డి నిరంతర సహకారంతో తన స్వగ్రామం మహిమలూరులో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు సతీష్‌రెడ్డి పాటు పడుతున్నారు. తన వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే తల్లి రంగమ్మ ఆరోగ్య, యోగక్షేమాలను అనునిత్యం డాక్టర్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం మరిచిపోరు. సోదరుడు శ్రీనివాసులురెడ్డి, సేవా దృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తులతో తన గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు సాధించడం వంటి కార్యక్రమాలతో సతీష్‌రెడ్డి కృషి చేస్తున్నారు. -
నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు
సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ ముఖ్య తారలుగా సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై వీజే రెడ్డి దర్శకత్వంలో సీహెచ్ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ–‘‘ నలుగురికి మేలు చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే అంశాలు ఆసక్తిగా ఉంటాయి. సెంటిమెంట్ చిత్రమైనా వినోదానికి కొదవ లేదు ’’ అన్నారు. ‘‘నెల్లూరి పెద్దారెడ్డి పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రహ్మణి, సంగీతం: గురురాజ్. -
పీబీసీ పనులను పరిశీలించిన సతీశ్ రెడ్డి
లింగాల: వైఎస్ఆర్ జిల్లా లింగాల కుడికాలువ, పులివెందుల బ్రాంచి కెనాల్ (పీబీసీ) పనులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు. అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రిటైర్డ్ సీఈలు సత్యనారాయణరెడ్డి, రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సీఈ గిరిధర్‌రెడ్డి, కడప సీఈ వరదరాజు, ఎస్ఈ గోపాల్‌రెడ్డి, డీఈ రవీంద్రనాథ్ గుప్తా తదితరులు ఉన్నారు. -
జూలైలో గండికోటకు నీరు!
సాక్షి ప్రతినిధి, కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారం తప్పకుండా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గండికోట, మైలవరంలో 35 టీఎంసీల నీరు నిల్వ చేసి సర్వారాయసాగర్ వరకూ నీరు ఇస్తామని, కడప జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటి 1200 నుంచి 1600 అడుగుల లోతుకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. భూగర్భజలాలను పెంపొందించే ప్రక్రియను ఎవరికి వారు వేగవంతం చేయాలన్నారు. తమ్ముళ్లూ మీరు ఒక్కసీటే గెలిపించారు. అయినా కూడ వెనుకుబాటు తనం రూపుమాపేందుకు కృషి చేస్తాను. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, టెక్స్టైల్ ఫార్కు ప్రకటించాను.. అవన్నీ చేసి తీరుతానని సీఎం పునరుద్ఘాటించారు. ఒంటిమిట్ట కోదండ రామునికి పట్టువస్త్రలు సమర్పించనున్నాం, టూరిజం సర్క్యూట్లో చేర్చి మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. ఎట్టిపరిస్థితుల్లో గండికోటకు నీరు ఇచ్చి తీరుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం చేయమని స్పష్టం చేశారు. దగా పడిన రైతులందరికీ ప్రమోజనం చేస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు. షేమ్..షేమ్... తెలుగు ఊపిరి, తెలుగే మాట్లాడాలి, తెలుగు రాష్ట్రంలోనైనా తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ తెలుగురచయితల సమావేశంలో ఇటీవల పెద్ద పెద్ద వక్తలు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో తెలుగు తప్పులు దొర్లాయి. ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆంద్రప్రదేశ్’ పతాక శీర్షికన అక్షరాలు ముద్రించారు. మేధావులు, అత్యున్నతాధికారులు, అమాత్యులు పాల్గొన్న సభలో అక్షర దోషం ఉండడంపై పలువురు విమర్శించారు. గండికోటకు రెండు మార్లు శంకుస్థాపన చేసి తొమ్మిది సంవత్సరాలల్లో రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారా అని చర్చంచుకోసాగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే గండికోట ప్రాజెక్టు సాధ్యమైందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. -
సతీష్.. గో బ్యాక్
వేంపల్లె, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న జేసీ దివాకర్‌రెడ్డిని ఎలా టీడీపీలో చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డితోపాటు కొంతమంది టీడీపీ నాయకులు ట్రిపుల్ ఐటీ ఆటస్థలంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు. వైఎస్ అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించారని సతీష్‌రెడ్డి విమర్శించడంతో విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. వైఎస్ వల్లే 6 వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. తన సొంత భూమి 360 ఎకరాలను ట్రిపుల్ ఐటీకి దానం చేశారన్నారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డిని టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారని.. ఆయన దౌర్జన్యాలకు పాల్పడలేదా అని సూటిగా ప్రశ్నించారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులనుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారు వెనుదిరిగారు. టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదు : ట్రిపుల్ ఐటీలో 6వేలమంది పేద విద్యార్థులకు వైఎస్ పుణ్యమా అని అవకాశం వచ్చింది. మీకు ఓటు వేయమంటే ఎలా వేస్తాం.. టీడీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. వైఎస్ కుటుంబానికే మా ఓటు వేస్తాం. - రాహుల్‌గౌడ్, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ జేసీని ఎలా చేర్చుకున్నారు వైఎస్ కుటుంబం హత్యా రాజకీయాలకు పాల్పడిదంటున్నారు.. తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు పాల్పడలేదా.. టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారు.. - గంగరాజు, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ తప్పతాగి ప్రచారం చేయడం భావ్యమా.. నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు తప్పతాగి వచ్చి ప్రచారం చేయడం భావ్యమా.. ఇది పద్దతి కాదు.. ఇలా ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారా.. తాగి ప్రచారం చేయడంవల్ల భయాందోళనకు గురయ్యాం. - బాబుల్‌రెడ్డి, టిపుల్ ఐటీ విద్యార్థి, ఇడుపులపాయ చంద్రబాబు అంత ఆస్తి ఎలా సంపాదించారు వైఎస్ రాజశేఖరరెడ్డిఅవినీతికి పాల్పడ్డారంటున్నారు.. మన మధ్యలేని ఆయనపై నిందలు వేయడం సరికాదు. రెండు ఎకరాల భూమితో సింగఫూర్లో హోటల్‌ను, ఇతర ఆస్తులను, రూ. 20వేల కోట్ల ఆస్తులను చంద్రబాబు, ఎలా సంపాదించారు. - అహమ్మద్, ట్రిపుల్ ఐటీ విద్యార్థిని, వేంపల్లె