కమల్‌ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్‌లుక్‌ అవుట్‌ | Kamal Kamaraju Sodara Sodarimanulara First Look Is Out | Sakshi
Sakshi News home page

Sodara Sodarimanulara : కమల్‌ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Thu, Jan 26 2023 11:23 AM | Last Updated on Thu, Jan 26 2023 11:27 AM

Kamal Kamaraju Sodara Sodarimanulara First Look Is Out - Sakshi

కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్. ఈ సినిమాతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  9 ఈఎమ్‌ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్‌ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

పక్కా స్క్రిప్ట్‌తో కేవలం 35రోజుల్లోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement