
చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఇట్స్ ఓకె గురు కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందన్నారు.
దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చిన కితాబు... తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్ పాల్గొన్నారు!!
Comments
Please login to add a commentAdd a comment