Harsh vardan Rane
-
కొత్త ప్రయోగం
నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. వీరితో పాటు మల్టీడైమన్షన్ వాసు, కళామందిర్ కల్యాణ్ అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా, తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. భిన్నమైన కథనంతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది’’ అని నీలకంఠ చెప్పారు. ఈ నెల 22న పాటల్ని, జూలై 4న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి. -
‘మాయ’ సినిమా స్టిల్స్
-
అతీంద్రియ శక్తులతో...
మనుషుల్లో ఉండే అతీంద్రియ శక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకుడు. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధురా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నీలకంఠ మాట్లాడుతూ- ‘‘ఇది నా కలల చిత్రం. వైవిధ్యమైన కథనంతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. కథ, కథనాలు కొత్త అనుభూతికి లోను చేస్తాయి. కొత్త దనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ సినీ వ్యవసాయదారుడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు సినీచరిత్రలోనే ‘యామ’ బెస్ట్ థ్రిల్లర్. సాంకేతికంగా అద్భుతం ఈ సినిమా. మేలో పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మధుర శ్రీధర్ తెలిపారు. ఇంకా చిత్ర తారాగణంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదరప్రసాద్ కూడా మాట్లాడారు.